ప్రస్తుతం రవితేజ పరిస్థితి ఏమాత్రం బాగాలేక పోవడంతో ప్రతి చిన్నవిషయంలో ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితి ఎదుర్కుంటున్నాడు. అసలే కెరియర్ బాగాలేని పరిస్థితులలో సినిమా విడుదల విషయంలో ప్లానింగ్ ఏమాత్రం తేడా కొట్టినా దాని తాలూకు ప్రభావం తన సినిమాల పై పడుతున్న నేపధ్యంలో మాస్ మహారాజ పరిస్థితి తీవ్ర గందర గోళంలో ఉంది. 

ప్రస్తుతం రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీపై అంచనాలు లేకపోవడంతో ఈమూవీ విడుదల కోసం సరైన డేట్ ను అన్వేషిస్తున్నారు. వాస్తవానికి ఈమూవీ ఈనెల అక్టోబర్ 5న విడుదల కావలసి ఉంటే విజయ్ దేవరకొండ ‘నోటా’ కు భయపడి వెనక్కు వెళ్లిపోయింది. దీనితో ఈమూవీని నవంబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇక్కడ కూడ రవితేజాకు ఎదురీత తప్పడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం నవంబర్ లో క్రేజీ సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. నవంబర్ మొదటివారంలో నాగచైతన్య ‘సవ్యసాచి’ విడుదల అవుతూ ఉండటంతో రవితేజా దీపావళి తరువాత వచ్చే నవంబర్ 16 గురించి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఇక్కడ కూడ విజయ్ దేవరకొండ అడ్డుగా నిలుస్తూ అదే డేట్ కు తన ‘టాక్సీ వాలా’ ను విడుదల చేస్తున్నాడు. రవితేజా మరింత ముందుకు జరిగి నవంబర్ నెలాఖరుకు వెళితే అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ సినిమా 2.0’ నవంబర్ 29న రెడీగా ఉంది. 
Ravi Teja’s Amar Akbar Anthony Concept Teaser
దీనితో ధైర్యం చేసి రవితేజా విజయ్ దేవరకొండతో పోటీగా రాకపోతే ఇక ఈసినిమాకు డిసెంబర్ వరకు మోక్షం లేదు అని అంటున్నారు. ఒక ఫెయిల్యూర్ హీరో మరో ఫెయిల్యూర్ దర్శకుడు కాంబినేషన్ లో జనం ఎప్పుడో మర్చిపోయిన ఇలియానాను తిరిగి తీసుకు వస్తూ చేస్తున్న ఈప్రయోగం సక్సస్ కాకపోతే రవితేజా పరిస్థితి మరింత డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: