టాప్ హీరోలు లాగే టాప్ దర్శకులు కూడ సంవత్సరానికి ఒక్క సినిమా మించి తీయలేకపోతున్నారు. అనుకోని విధంగా ఆసినిమా ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్ గురించి ఏర్పడే నిరాశతో మరికొంత కాలం గ్యాప్ ఏర్పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో ‘అరవింద సమేత’ తో తరిగి సక్సస్ బాటపట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహార శైలి పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ ఇప్పటికే నిర్మాత దానయ్య దగ్గర అదేవిధంగా మైత్రీ మూవీస్ దగ్గర సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ లు తీసుకున్నట్లు టాక్. ఇది చాలదు అన్నట్లుగా ‘అరవింద సమేత’ విడుదలకు ముందు హీరో కళ్యాణ్ రామ్ దగ్గర కూడ అతని సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కు ఒక సినిమా చేసే విషయంలో భారీ అడ్వాన్స్ ను తీసుకున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
దీనితో అసలు త్రివిక్రమ్ రానున్న రోజులలో ఎన్ని సినిమాలు తీస్తాడు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాలలో సెటైర్లు వేసుకుంటున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘అరవింద సమేత’ రిజల్ట్ వచ్చిన తరువాత త్రివిక్రమ్ మరొక వైపు వెళ్ళి పోకుండా అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో త్రివిక్రమ్ బన్నీల ప్రాజెక్ట్ ఇంచుమించు ఫైనల్ అయినట్లే అన్న వార్తలు వస్తున్నాయి. 
అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
తెలుస్తున్న సమాచారం మేరకు గత రెండు రోజులుగా బన్నీ త్రివిక్రమ్ ల మధ్య రెండు కథలకు సంబంధించి లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఒక కథ బాలీవుడ్ హిట్ మూవీకి అనుసరణ అయితే మరొక కథ త్రివిక్రమ్ తాను సొంతంగా రాసుకున్నది అని తెలుస్తోంది. ఈ రెండు కథలలో ఏకథను ఎంపిక చేయాలి అన్న నిర్ణయం త్రివిక్రమ్ అల్లు అర్జున్ కే వదిలేసినట్లు టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ప్రారంభానికి డిసెంబర్ లో ఒక మంచి ముహూర్తం కూడ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉండగానే త్రివిక్రమ్ కళ్యాణ్ రామ్ ను మరో క్రేజీ యంగ్ హీరోని కలిపి ఒక మల్టీ స్టారర్ చేసే ఆలోచనలు కూడ ఉన్నాయి అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: