మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 70 శాతం వరకు షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.


అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు వినయ విధేయ రామా అన్న టైటిల్ పరిశీలణలో ఉన్నదని వార్తలు వచ్చాయి. దసరాకి టైటిల్ తో పాటు రాం చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని భావించినా అది కుదరలేదు. అయితే వినయ విధేయ రామా టైటిల్ చిత్రయూనిట్ అంతా ఓకే చేసినా మెగాస్టార్ నుండి ఆమొదం దక్కించుకోలేదట.


రాం చరణ్ లాంటి హీరోకి అలాంటి టైటిల్ యాప్ట్ అవుతుందా అని డౌట్ పడుతున్నారట. చిరంజీవి అయితే వినయ విధేయ రామా బదులు మరో టైటిల్ పెట్టమని చెప్పాడట. కాని చరణ్ కూడా బోయపాటి ప్రస్తుతం పెట్టిన వినయ విధేయ రామా టైటిల్ కు కన్విన్స్ అయ్యాడట. చిరంజీవికి నచ్చకపోయినా సరే ఆ టైటిల్ నే ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.


రంగస్థలం సినిమా విషయంలో కూడా టైటిల్ ఏది పెట్టాలి అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది. సుకుమార్ మీద నమ్మకంతో చరణ్ చిరుని కాదని రంగస్థలం టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బోయపాటి శ్రీను విషయంలో కూడా అదే తరహాలో వినయ విధేయ రామా టైటిల్ కే తన ఓటు వేశాడట. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా చరణ్ హిట్ మేనియా కొనసాగించేలా చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: