‘వీరభోగ వసంతరాయలు’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అదేవిధంగా ఆమూవీకి సంబంధించిన స్టిల్స్ ను చూసిన వారు ఈమూవీలో ఒక డిఫరెంట్ కథ ఉంటుంది అని ఆశించారు. అయితే ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసే విధంగా ఈసినిమా ఉంది అన్న ఫస్ట్ టాక్ వినపడుతోంది. 
Veera bhoga Vasanta rayulu
ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈసినిమా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ మాదిరిగా ఉండడంతో పాటు సినిమా మేకింగ్ నాణ్యత విషయాలలో కూడ చాల తక్కువగా కనిపించడం ఈమూవీని విడుదలకు ముందే ఓవర్సీస్ లో చూసిన ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియలు లాంటి మంచి నటులు ఉన్నా సరైన కథ లేకుండా అయోమయంగా ఈసినిమాను తీయడంతో ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.   

ఇది ఇVeera-Bhoga-Vasantha-Rayalu-Movie-Reviewలా ఉంటే ఈమూవీ పై ఉన్న నమ్మకంతో రిలీజ్ డేట్ కు రెండురోజులు ముందుగానే ఈమూవీని అమెరికాలో విడుదల చేసి ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలి అని చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకు ముందుగానే నెగిటివ్ టాక్ వస్తే ఆసినిమా నిలబడటం చాల కష్టం.
veera bhoga vasantha rayalu shooting completed - Sakshi
దీనికితోడు ఈసినిమాలో నటించిన నారా రోహిత్ శ్రీవిష్ణు సుధీర్ బాబులలో ఎవరికీ ప్రస్తుతం అదృష్టం లేకపోవడంతో వారి దురదృష్టం కూడ ఈసినిమాకు శాపంగా మారబోతోంది. దీనితో ఒక పాజిటివ్ టాక్ ను మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అమెరికాలోని ఓవర్సీస్ ప్రేక్షకుల ద్వారా ముందుగా తీసుకురావాలి అని చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం అయ్యాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: