అక్కినేని కోడలుగా సమంత మారిన తర్వాత తాను చేయబోయే సినిమా పాత్రల ఎంపికలో సమంత చాల ఆచితూచి వ్యవహరిస్తోంది. ‘యూటర్న్’ లాంటి వైవిధ్యమైన సినిమాను చేసినా ఆసినిమా కమర్షియల్ గా సక్సస్ కాకపోయినా ఆవిషయాలను పట్టించుకోకుండా సమంత ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక కొరియన్ ఫిలిం ఆధారంగా నిర్మింప బడుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Samantha Latest Image
ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావడంతో ఈమూవీ షూటింగ్ ను త్వరలో మొదలు పెట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలోని సమంత పాత్రకు భిన్నమైన షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. 
Samantha Ruth Prabhu,Samantha,actress Samantha,Samantha hot pics,Samantha hot images,Samantha hot stills,Samantha hot pictures,Samantha hot photoshoot
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో సమంత పాత్ర భిన్నమైన షేడ్స్ లో ఉంటుందని టాక్. పైకి సమంత చాల యంగ్ గా అందంగా కనిపించినా మనసు మాత్రం ఓల్డ్ ఏజ్ ఫీల్ తో ఉంటుందని అంటున్నారు. దీనితో సమంత అందం చూసి చాలామంది అబ్బాయిలు ఆమె మనసు తెలియక వెంటపడే సున్నితమైన హాస్యంతో కూడిన మూవీగా ఈమూవీ ఉంటుందని సమాచారం.
Samantha Photos At Balakrishnudu Audio Launch-02
ఇక ఈసినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసిన నాగశౌర్య క్యారెక్టర్ ఈసినిమాకు అత్యంత కీలకం అని అంటున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ సినిమా దగ్గర నుంచి నందినీ రెడ్డికి నాగశౌర్య కుటుంబ సభ్యులందరితో మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం నాగశౌర్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటున్న నేపధ్యంలో సమంత ద్వారా తిరిగి హిట్ ట్రాక్ లోకి రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో..  


మరింత సమాచారం తెలుసుకోండి: