లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డి సంచలనాలు అందరికి తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే లీడ్ రోల్స్ చేశారు. సినిమాలో విజయ్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ, హింది భాషల్లో రీమేక్ అవుతుంది.


బాలా డైరక్షన్ లో తమిళ అర్జున్ రెడ్డి సినిమాకు వర్మ అని టైటిల్ పెట్టారు. వర్మ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా టీజర్ సోసోగా అనిపించింది. ఇక ఇదే విధంగా అర్జున్ రెడ్డి హింది రీమేక్ కూడా సెట్స్ మీదకు వెళ్లింది.


అయితే హింది అర్జున్ రెడ్డిని సందీప్ వంగ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇక్కడ ఈ సినిమాకు టైటిల్ గా కబీర్ సింగ్ అని పెట్టారట. సినిమాలో షాహిద్, కియరాల రొమాన్స్ అదిరిపోతుందని అంటున్నారు.


బాలీవుడ్ కు వెళ్లిన అర్జున్ రెడ్డి కచ్చితంగా సినిమా కంటెంట్ లో కూడా కొంత మార్పులను చేసుకోవడం ఖాయం. ఈ సినిమా కోసం సాహిద్ గడ్డం పెంచాడట. ఇప్పటికే షూటింగ్ మొదలైన కబీర్ సింగ్ అక్కడ ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. సందీప్ వంగ మాత్రం కబీర్ సింగ్ మీద కూడా ఫుల్ కాన్ ఫిడెంట్ తో ఉన్నాడు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: