మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ టీమ్ తన జార్జియా షెడ్యూల్ ను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత ఈమూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ విషయాల పై దృష్టి పెట్టింది. వచ్చేనెల నుండి ప్రారంభం కాబోతున్న లేటెస్ట్ షెడ్యూల్ లో ‘ఉయ్యాలవాడ’ పాత్రను పోషిస్తున్న చిరంజీవి నయనతార తమన్నాల పై రెండు పాటలు చిత్రీకరించడానికి భారీ సెట్స్ నిర్మాణం చేస్తున్నారు.
sye raa shooting latest update
అయితే ఇక్కడే ‘సైరా’ టీమ్ కు అనుకోని సమస్యలు ఏర్పడుతున్నట్లు సమాచారం. చిరంజీవి సినిమాలలోని పాటలు అంటే ప్రేక్షకులను అలరించే స్టెప్స్ విపరీతంగా ఉంటాయి. 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ ఘన విజయం సాధించడానికి ఆమూవీలో చిరంజీవి వేసిన ‘అమ్మడు కుమ్ముడు’ స్టెప్స్ ఏవిధంగా సహకరించాయో అందరికీ తెలిసిన విషయమే. 

అయితే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చారిత్రక నేపధ్యం ఉన్న మూవీ కాబట్టి ఈమూవీలోని రొమాంటిక్ పాటల విషయంలో గతంలోని చిరంజీవి సినిమాలలోని మాస్ స్టెప్స్ లా కాకుండా కొంత డిఫరెంట్ గా డిజైన్ చేయమని ఈపాటలకు కొరియోగ్రఫీ చేయబోతున్న శేఖర్ మాస్టర్ కు చిరంజీవి స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. అయితే చిరంజీవి సినిమాలు అంటే స్టెప్స్ లేకుండా అభిమానులు చూడరు కాబట్టి చిరంజీవి కోరుకునే డిఫరెంట్ స్టెప్స్ ఎలా డిజైన్ చేయాలి అన్న విషయమై దర్శకుడు సురేంద్ర రెడ్డి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లోతైన చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

‘సైరా’ చారిత్రాత్మక నేపధ్యంలో నడిచే ఒక స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఆసినిమా స్థాయిని తగ్గించే విధంగా పాటలు స్టెప్స్ ఉండకూడదు అంటూ చిరంజీవి అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి సినిమాలు అంటేనే మాస్ మసాలా స్టెప్స్ కాబట్టి అవి లేకుండా పాటలు హుందాగా చిత్రీకరిస్తే జనం చూడరు కాబట్టి ఈ హుందా తనంలో ఒక వెరైటీని ఎలా సృష్టించాలి అన్న టెన్షన్ ప్రస్తుతం ‘సైరా టీమ్ ను వెంటాడుతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: