అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమా గురించి ఆలోచనలు చేస్తూనే మధ్యలో తన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న కొన్ని వాణిజ్య సంస్థలకు మరికొన్ని మల్టీ నేషనల్ కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో నటిస్తూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లేటెస్ట్ గా బన్నీ ‘రెడ్ బస్’ వ్యాపార ప్రకటన కోసం ఒక యాడ్ లో నటించాడు.
బన్నీలో మెరుపు వేగం
ఈ యాడ్ లో  బన్నీకి జంటగా మోడల్ హీరోయిన్ అయిన పరుల్ గులాటి నటించింది.  నాగ శౌర్య సరసన ‘నీ జతలేక’ చిత్రంలో నటించి టాలీవుడ్ కు పరిచయం అయిన ఈబ్యూటీ ఆతరువాత సరైన అవకాశాలు లేక టాలీవుడ్ కు దూరం అయింది. అయితే పంజాబీ హిందీ చిత్రాలలో నటిస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రెడ్ బస్ యాడ్ లో బన్నీతో నటించిన ఈబ్యూటీ అల్లు అర్జున్ ను ప్రశంసలతో ముంచెత్తి వేస్తూ ఆ యాడ్ షూటింగ్ కు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తిరిగి తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో పడేలా ప్రయత్నాలు చేస్తూ బన్నీని అస్త్రంగా మార్చుకుంది. 
డాన్సులు ఎలాగో ఆయన కూడా అంతే
ఈయాడ్ షూటింగ్ లో అల్లు అర్జున్ లో మెరుపు వేగం చూసి తాను మంత్ర ముగ్ధురాలిని అయ్యాయని పరుల్ చెబుతోంది. బన్నీ డాన్సులు ఎలా ఉంటాయో అతడి వర్క్ కూడా అంతే స్పీడ్ గా ఉంటుంది అని పరుల్ చెబుతోంది. బన్నీతో కలసి సినిమాల్లో నటించక పోయినా తాను స్టైలిష్ స్టార్ అభిమానిని అంటూ అల్లు అర్జున్ పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తూ అతడితో తీసుకున్న ఒక సేల్ఫీని షేర్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ పరుల్ హాట్ టాపిక్ గా మారింది. 
హాట్ హీరోయిన్ ప్రశంసలు
అల్లు అర్జున్ పై ఈమె కురిపిస్తున్న ప్రశంసలు పరిశీలిస్తున్నవారు మాత్రం ఈమె తిరిగి టాలీవుడ్ లోకి రావడానికి అల్లు అర్జున్ ద్వారా ప్రయత్నాలు చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఛార్మి రకుల్ ప్రీత్ సింగ్ తాప్సిలు లాంటి పంజాబీ హీరోయిన్స్ చాల తెలివిగా తెలుగులో టాప్ హీరోల పక్కన అవకాశాలు కొట్టేసిన నేపధ్యంలో పరుల్ గులాటి కూడా ఇదే పంధాను అనుసరిస్తూ బన్నీని కార్నర్ చేస్తోందా అంటూ జోక్స్ పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: