ఈ మద్య భారతీయ సినిమాలు విదేశాల్లో దుమ్మురేపుతున్నాయి.  ‘త్రీ ఇడియట్స్’,‘పీకే’, ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ షేక్ చేసిన విషయం తెలిసిందే.  ఇక రాజమౌళి దర్శకత్వంలో  ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2 ’ సినిమా సైతం విదేశాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ‘దంగల్’ మూవీ ఐతే... చైనాలో ఏకంగా రూ.1200కోట్లను రాబట్టింది. ఈ మూవీ చైనాలో అత్యధిక వసూళ్లను సాధించిన హాలీవుడేతర సినిమా రికార్డు క్రియేట్ చేసింది.   గత కొంత కాలంగా  భారతీయ సిన్మాలకు వాల్డ్ వైడ్ గా మంచి మార్కెట్ పెరిగింది. అందులో చైనా మార్కెట్‌లో ఇపుడిపుడే బాలీవుడ్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది.   
Image result for hichki-movie
బాలీవుడ్ మూవీ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ కి ఇక్కడ రూ.50 కోట్లు వస్తే..చైనా మార్కెట్ లో రూ.400 కోట్లను కొల్లగొట్టింది.  మరోవైపు ఇర్ఫార్ ఖాన్ ‘హిందీ మీడియం’, అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్’ మూవీలు చైనా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించాయి. తాజాగా రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ పి. మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిచ్కీ’ మూవీ చైనాలో గత వారం విడుదలై బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Related image
చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు రాణి ముఖర్జీ తెలిపింది. కంటెంట్‌ ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొంది. ఈ సినిమా చైనాలో ఒక వారంలోనే 13.94 మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేయడం విశేషం. మన కరెన్సీలో దాదాపు రూ.102.09 కోట్లు వసూలు చేసి చైనాలో మంచి జోరు మీదుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించాడు. ముందు ముందు ఈ  మూవీ చైనాలో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: