గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  రీసెంట్ గా నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే..ఈ మద్య టివి, సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ అనారోగ్యం కారణంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  తాజాగా తాజాగా ప్రముఖ నిర్మాత డి శివప్రసాదరెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది.


సర్జరీ తరువాత గత రాత్రి ఆయన ఆరోగ్యం విషమించి మరణించినట్టు తెలుస్తోంది.  1985 సంవత్సరంలో ‘కామాక్షీ మూవీస్ బ్యానర్’ ని స్థాపించారు శివప్రసాద్ రెడ్డి.  అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు.  శ్రావణ సంధ్య, కార్తీకపౌర్ణమి,  ముఠామేస్త్రీ,  విక్కీదాదా, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ, గ్రీకువీరుడు తదితర చిత్రాలను నిర్మించారు.


అయితే ఎక్కువగా శివప్రసాద్ రెడ్డి,  కింగ్ నాగార్జునతో కలిసి పనిచేశారు.  తాజాగా శివప్రసాదరెడ్డి మృతికి నాగార్జున సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన లేని లోటు తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సంతాపాన్ని వెలిబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: