యువ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ నోటా అతన్ని కెరియర్ లో చాలా వెనుకపడేలా చేసింది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం హిట్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ తమిళంలో మొదటి ప్రయత్నం గా చేసిన సినిమా నోటా. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేశారు.


ప్రస్తుతం తెలుగులో విజయ్ కు ఉన్న క్రేజ్ ప్రకారంగా నోటా సినిమాను 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో కొనేశారు. మొదటిరోజు సందడి బాగా చేసినా సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయే సరికి కలక్షన్స్ ఢీలా పడ్డాయి. ఇక టోటల్ రన్ లో నోటా తెలుగు వర్షన్ కేవలం 9.83 కోట్లను మాత్రమే రాబట్టింది.


విజయ్ ఇదవరకు సినిమాల కలక్షన్స్ కు నోటా కలక్షన్స్ కు అసలు సంబంధం లేదు. నోటా పెట్టుబడులలో 40 శాతం మాత్రమే రికవెరీ అయ్యాయి. ఎలా లేదన్నా 60 శాతం వరకు డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలపాలయ్యారు. అంతేకాదు నోటా రిజల్ట్ విజయ్ కెరియర్ పరంగా కూడా చాలా దెబ్బ వేసిందని చెప్పొచ్చు.


టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ గా విజయ్ దేవరకొండ సందడి బాగానే ఉన్నా ఇలాంటి సినిమాల వల్ల అతని కెరియర్ సందిగ్ధంలో పడుతుందని అంటున్నారు అతని అభిమానులు. ప్రస్తుతం రాబోతున్న టాక్సీవాలా మీద కూడా పెద్ద అంచనాలు లేవు. అందుకే వచ్చిన ఇమేజ్ కాపాడుకునేందుకు విజయ్ దేవరకొండ చాలా కష్టపడాల్సి ఉందని అంటున్నారు సిని పెద్దలు.



మరింత సమాచారం తెలుసుకోండి: