అప్పటిదాకా యువ హీరోలతో మీడియం హీరోతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ కు స్టార్ హీరోయిన్ గా అయ్యేందుకు ఓ ఛాన్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. తన సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆ అమ్మడు ఆ తర్వాత అందరు స్టార్స్ సరసన నటించేసింది. అయితే ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉన్న ఆ హీరోయిన్ చరణ్ తో ఛాన్స్ వచ్చినా కాదనేసింది.


ఇంతకీ చరణ్ సినిమాలో అవకాశం కాదన్న ముద్దుగుమ్మ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తుంది. తెలుగులో అప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతో చేస్తున్న రకుల్ ను బ్రూస్ లీ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మార్చాడు చరణ్ ఇక ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధ్రువ, మహేష్ తో స్పైడర్ ఇలా వరుస స్టార్స్ తో నటించి తగినంత క్రేజ్ తెచ్చుకుంది.


ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్త వెనుక పడినట్టు కనిపిస్తున్న రకుల్ కు ఛరణ్, బోయపాటి శ్రీను సినిమా నుండి లక్కీ ఛాన్స్ వచ్చిందట. సినిమాలో అదిరిపోయే ఐటం సాంగ్ ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్ కూడా బాగా వచ్చిందట.


సినిమాలో ఆ సాంగ్ చేసేందుకు రకుల్ ను అడుగగా ఆమె సారీ అనేసిందట. చరణ్ తో స్పెషల్ సాంగ్ అది కూడా భారీ అంచనాలతో వస్తున్న మూవీ అయినా సరే ఈ టైంలో ఐటం సాంగ్స్ చేస్తే ఇక వచ్చేవన్ని అలాంటి ఆఫర్లే అవుతాయని భావించిందట రకుల్. అయినా సరే కాజల్ ను స్పూర్తిగా తీసుకుని ఐటం సాంగ్ చేస్తే బాగుండేది అంటున్నారు ఆమె అభిమానులు. రకుల్ కాదన్న ఆ సాంగ్ లో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ప్లాన్ చేస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: