కొంతమంది హీరోయిన్స్ ఒక్క హిట్ తో స్టార్ రేంజ్ కు వెళ్తుంటారు. మరికొంతమంది వరుస సినిమాలు చేస్తూ చిన్నగా స్టార్ ఇమేజ్ దక్కించుకుంటారు. అయితే చేసే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా వరుసగా అవకాశాలు దక్కించుకోవడం మాత్రం ఒక్క తమిళమ్మాయి మేఘా ఆకాష్ వల్లే అవుతుందని చెప్పొచ్చు.


మోడల్ గా కెరియర్ కొనసాగిస్తున్న అమ్మడు ధనుష్, గౌతం మీనన్ కలిసి చేసిన ఎన్నై నొక్కి పాయుం తొట్ట సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే తెలుగులో నితిన్ పక్కన వరుసగా లై, ఛల్ మోహన్ రంగ రెండు సినిమాల్లో నటించింది మేఘా. అయితే ఆ సినిమాలు నిరాశ పరచడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు.


ఇదిలాఉంటే తమిళం లో మాత్రం మేఘా ఆకాష్ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే రజిని పెట్ట సినిమాలో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాష్ శింభు హీరోగా వస్తున్న తమిళ అత్తారింటికి దారేది సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. ఇవే కాకుండా మరో రెండు తమిళ సినిమాల్లో అవకాశం దక్కించుకుందట ఈ అమ్మడు.


మరి సినిమాలు సక్సెస్ కాకున్నా అమ్మడికి ఎక్కడో సుడి ఉంది కావొచ్చు అందుకే ఇలా వరుస అవకాశాలు అందుకుంటుంది. రాబోయే సినిమాలతో మేఘా హిట్ కొడితే కనుక మరోసారి తెలుగులో ఆమె నటించే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా మేఘా లక్ చూసి మిగతా హీరోయిన్ కుళ్లుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: