మహేష్ కరియర్ కు సంబంధించి 25వ సినిమాగా రూపొందుతున్న ‘మహర్షి’ అతడి సినిమాలలో ది బెస్ట్ మూవీగా నిలిచిపోవాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ వంశీ పైడిపల్లి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఉగాది పండుగ రోజున విడుదల కాబోతున్న ఈమూవీలో వచ్చే ఏడాది టాప్ హీరోల సమ్మర్ రేస్ ప్రారంభం కాబోతోంది.

ఈమూవీకి నిర్మాతలుగా ముగ్గురు వ్యవహరిస్తున్నా నిర్మాణ బాధ్యతలు మాత్రం అన్నీ దిల్ రాజ్ స్వయంగా చూసుకుంటూ ఈమూవీ బిజినెస్ విషయాలను కూడ అంచనాలు పెంచుతూ ఈమూవీకి అత్యధిక బిజినెస్ వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారమే దిల్ రాజ్ మహేష్ ల మధ్య కొంత భేదాభిప్రాయాలు ఏర్పడటానికి కారణం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. 
Mahesh Babu Maharshi Teaser: 'महर्षि' बन साउथ सुपरस्टार महेश बाबू ने किया ऐसा काम, Twitter पर मचा तहलका...
ఈమూవీకి అత్యధిక బిజినెస్ చేసి బాగా లాభాలు తీసుకు రావాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ను 25 కోట్లకు ఒక బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కు అమ్మినట్లు సమాచారం. అయితే ఈమూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుకున్న ఆ డిస్ట్రిబ్యూటర్  ఈమూవీలో సెంటిమెంట్ సీన్స్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండాలి అని కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. 
Exclusive: Mahesh Babu’s Maharshi Film In Rural Backdrop!
అయితే ఈసినిమాకు సంబంధించి కేవలం రెండు మాత్రమే ఫైట్ సీక్వెన్స్ సీన్స్ ఉన్న నేపధ్యంలో ఈ సీన్స్ సంఖ్యను మరో రెండు పెంచమని దిల్ రాజ్ దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. దీనితో ఈవిషయాలు తెలుసుకున్న మహేష్ దిల్ రాజ్ కు క్లాస్ పీకడమే కాకుండా ఈమూవీలో యాక్షన్ సీన్స్ ప్రధాన అంశం కాదని ఈమూవీ కథ స్వరూపాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయవద్దని మహేష్ దిల్ రాజ్ కు సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో దిల్ రాజ్ ఈసినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ విషయమై బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయానికి ఎలా పరిష్కారాలు చేయాలి అని తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: