నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సవ్యసాచి మూవీ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా సినిమాలో నటించిన మాధవన్ రాగా.. విశిష్ట అతిథిగా యువ హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు.


ఒక హీరో ఈవెంట్ కు మరో హీరో రావడం కొత్త విషయం కాకున్నా చైతు తనకు ఎంత క్లోజ్ అన్నది విజయ్ ఈ వేడుకలో మాట్లాడితే కాని తెలియలేదు. నాగ చైతన్యతో మాట్లాడితే ఎలాంటి టెన్షన్ అయినా ఇట్టే పోతుందని అంటున్నాడు విజయ్. సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఎంట్రీ కోసమే ఎదురుచూశానని తన పాత్ర రోజులు గుర్తు చేసుకున్నాడు విజయ్.


వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సవ్యసాచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అప్పియరెన్స్ అతని ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు వేడుక చైతుది అయినా సరే స్టేజ్ మీద డ్యాన్స్ వేసి అక్కినేని ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. గెస్ట్ గా వచ్చిన మాధవన్ కూడా విజయ్ ఈ ఈవెంట్ లో పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్త పరిచారు.


నోటా ఫ్లాప్ తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మళ్లీ విజయ్ స్టామినా తెలియచేసేలా ఉంటుందని అంటున్నారు. గీతా గోవిందంలో తనకు జోడీగా నటించిన రష్మిక మందన డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: