ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను తమిళం లో హీరో విశాల్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ గురించి విశాల్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు.  ఇది కేవలం రీమేక్ మాత్రమేనని, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదంటున్నాడు విశాల్. ఎన్టీఆర్ యాక్టింగ్ ను తను బీట్ చేయలేనని ఓపెన్ గానే చెబుతున్నాడు. "ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ను మాత్రం నేను బీట్ చేయలేను. ఏడాదిన్నర కిందట టెంపర్ చూశాను. మరోసారి చూడమని డైరక్టర్ కోరితే చూడనని చెప్పాను.

Image result for vishal hero

ఎందుకంటే ఇంకోసారి చూశానంటే నేను ఎన్టీఆర్ మాయలో పడిపోతాను. అతడిలానే నటించడానికి ప్రయత్నిస్తాను. అది నాకు ఇష్టం లేదు." తన ప్రతి సినిమా తెలుగులోకి వస్తుందని, టెంపర్ రీమేక్ మాత్రం తెలుగులోకి రాదంటున్నాడు విశాల్. దాన్ని తెలుగులోకి విడుదల చేస్తే ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొస్తాయని చెబుతున్నాడు. నా ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. టెంపర్ రీమేక్ కూడా తెలుగులో రిలీజ్ చేయొచ్చు.

Image result for vishal hero

ఎందుకంటే తెలుగు వెర్షన్ కు, తమిళ వెర్షన్ కు చాలా మార్పులు చేశాం. సినిమా కొత్తగానే ఉంటుంది. కానీ తెలుగులో రిలీజ్ చేయను. ఎందుకంటే, తెలుగులో విడుదల చేస్తే నా నటనను ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తారు. అది నాకు భయం."  ఎన్టీఆర్ ఒక సినిమా చేశాడంటే అది 10-12 ఏళ్లు గుర్తుంటుందని... కాబట్టి టెంపర్ రీమేక్ ను మళ్లీ తెలుగులో రిలీజ్ చేయడం మంచిపని కాదంటున్నాడు విశాల్. టెంపర్ కంటే ముందు మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల రీమేక్స్ కోసం కూడా మేకర్స్ తనను సంప్రదించారని, కానీ టెంపర్ మాత్రమే రీమేక్ చేయాలని తనకు అనిపించిందంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: