హస్కీ వాయస్ తో మత్తుగా కనిపించే కళ్ళతో చాల డిఫరెంట్ గా కనిపించే అనూ ఇమ్మాన్యూయేల్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిలిం ఇండస్ట్రీ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిలిం ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఎదగాలి అంటే మన చుట్టూ ఉన్న మనుషులను సరిగ్గా హ్యాండిల్ చేయగల సమర్ధత ఉండాలి అని అది లేకుంటే ఎంత అందం ఉన్నా సమర్ధత ఉన్నా ఫిలిం ఇండస్ట్రీలో రాణించడం కష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
Anu Emmanuel Upcoming Movies List 2018, 2019 & Release Dates
సినిమా ఇండస్ట్రీలో సక్సస్ లేకుండా అవకాశాలు రావు అని అంటూ అయితే సినిమాలు ఫెయిల్ అయినంత మాత్రాన ఆసినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ పనికిరారు అన్న అభిప్రాయం తనకు చాల ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ కష్టాల నుండే సక్సస్ వస్తుంది అంటూ సక్సస్ మంత్రాను ఉపదేసిస్తోంది అనూ ఇమ్మాన్యూయేల్. ఇక తనతో ఇప్పటివరకు నటించిన హీరోల మనస్తత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈబ్యూటీ. 
అను ఇమ్మానుయేల్ లేటెస్ట్ ఫొటోస్  2
ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు నటించిన ఏ హీరోలోను పవన్ లో కనిపించే తనకు కనిపించలేదని పవన్ తో నటించేడప్పుడు పెద్దగా పవన్ మాట్లాడకపోయినా పవన్ మౌనంలో తనకు ఎన్నో అర్ధాలు కనిపించాయి అంటూ పవన్ పై ప్రశంసలు కురిపిస్తోంది ఈ బ్రిటీష్ బ్యూటీ. ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ తో నటిస్తూ ఒక లిప్ లాక్ సీన్ లో కనబడేడప్పుడు పవన్ ఎంతో మొహమాట పడ్డాడని ఆ సన్నివేశ చిత్రీకరణ విషయంలో అతడు ప్రవర్తించిన సభ్యత తనకు ఎంతో నచ్చింది అంటూ కామెంట్స్ చేసింది ఈ ‘అజ్ఞాతవాసి’ హీరోయిన్. 

ఇదే సందర్భంలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ వర్క్ పట్ల అతడు చాల సిన్సియర్ అని చెపుతూ నాగచైతన్య కంఫర్టబుల్ కో స్టార్ అంటూ కామెంట్స్ చేస్తోంది ఈబ్యూటీ. గోపీచంద్ గురించి మాట్లాడుతూ కామ్ గోయింగ్ అంటూ కామెంట్స్ చేసిన అనూ నాని విషయం దగ్గరకు వచ్చే సరికి రొమాంటిక్ పర్సన్ అంటూ ఊహించని కామెంట్స్ చేసింది. ఇక అదృష్టం గురించి మాట్లాడుతూ ‘నాపేరు సూర్య’ సినిమా కోసం తాను ‘గీత గోవిందం’ ఛాన్స్ ను వదులుకున్న విషయం గురించి మాట్లాడుతూ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కనిపించని అదృష్టం ప్రతివ్యక్తి జీవితాన్ని శాసిస్తుంది అంటూ అనూ చేసిన కామెంట్స్ వెనుక ఎంతో వేదాంత ధోరణి ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: