సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన వాళ్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాటుగా ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కూడా కొనసాగించడం కామన్ అయ్యింది. బాలీవుడ్ లో ఈ తరహా న్యూస్ ఎక్కువగా వినిపిస్తాయి కాని ఇప్పుడు తెలుగు పరిశ్రమలో కూడా ఒక్క సినిమా చేసిన హిట్ పెయిర్ జోడీగా కనిపిస్తున్నారు.


లేటెస్ట్ గా అలాంటి ఓ జంట ఎక్కడ చూసినా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరు అంటే.. ఇంకెవరు రాం, అనుపమ పరమేశ్వరన్ అని అంటున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రాం తో వరుసగా రెండు సినిమాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్. ఉన్నది ఒకటే జిందగి, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో రాం, అనుపమ కలిసి నటించారు.


మొదటి సినిమా ఫెయిల్ అయినా రెండో సినిమా దసరా కానుకగా వచ్చి హిట్ అందుకుంది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా సక్సెస్ టూర్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాం, అనుపమ మరింత క్లోజ్ అయ్యారట. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని అంటున్నారు. 


సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి అందరు షాక్ అయ్యారు. హీరో హీరోయిన్ మధ్య ఆ మాత్రం చనువు కామనే కాని ఈ మళయాళ కుట్టి మన తెలుగు హీరో లవ్ లో పడిందని ఇండస్ట్రీ టాక్. ఎలాగు రాం కూడా పెళ్లీడుకి వచ్చాడు కాబట్టి రామ్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తే బెటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: