టాప్ హీరోల మధ్యనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య పోటీ బాగా పెరిగి పోవడంతో సుమన్ కు సినిమాలలో అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాల బాట పట్టిన సుమన్ రానున్న తెలంగాణా రాష్ట్ర ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కోసం ప్రచారం చేయబోతున్నాడు. విశాఖపట్టణంలో జరిగిన ఒక కరాటే కాంపిటేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన సుమన్ అక్కడి మీడియా వర్గాలతో మాట్లాడుతూ పవన్ ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
KCR
వాస్తవానికి పవన్ సుమన్ ల మధ్య ఎటువంటి వైరం లేదు. ఆమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ పవన్ ‘జనసేన’ గురించి మద్దతుగా మాట్లాడటమే కాకుండా పవర్ స్టార్ సిద్దాంతాలు తనకు నచ్చుతాయి అంటూ ప్రశంసలు కూడ కురిపించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ సుమన్ తన స్వరం మార్చి పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

నిన్న మొన్నటివరకు ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకు వెళ్ళాలి అంటూ ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ ఇప్పుడు తన అభిప్రాయం మార్చుకుని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా విషయమై ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు సుమన్. అంతేకాదు పవన్ ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షకు కూర్చుంటే ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఆరాధ్య దైవంగా పవన్ మారుతాడని అలా చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం ఏమిటి అంటూ సుమన్ పవన్ ను ప్రశ్నిస్తున్నాడు. 
I'm not interest to leaving cinema industry says actor suman
పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో ఢిల్లీ వెళ్లి ఉద్యమానాలు చేస్తే పొలిటికల్ హీరో అవుతాడని అయితే అద్భుతమైన అవకాశాన్ని పవన్ చేయిజార్చు కుంటున్నాడు అంటూ అభిప్రాయ పడుతున్నాడు సుమన్. అయితే ఇలాంటి ప్రశ్నలు ఎవరు ఎన్ని అడిగినా మౌనం తన సమాధానంగా కొనసాగే పవన్ కళ్యాణ్ సుమన్ సలహాను కూడ పట్టించుకోడు అన్నది వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: