రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ నవంబర్ నెల నుండి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో చరణ్ జూనియర్ లు సుమారు సంవత్సరం కాలంపాటు రాజమౌళి బందిఖానాలోనే ఉండబోతున్నారు. ‘అరవింద సమేత’ తరువాత జూనియర్ సినిమా మళ్ళీ చూడాలి అంటే రాజమౌళి సినిమా వచ్చే వరకు ఆగవలసిన పరిస్థితి. 
Bharat Ane Nenu Box-Office Collection: Mahesh Babu - Kiara Advani's Film Crosses Rs 125 Crore Mark
అదేవిధంగా చరణ్ కు సంబంధించి కూడ బోయపాటి మూవీ విడుదల తరువాత చాల కాలం వరకు చరణ్ నుండి సినిమాలు వచ్చే అవకాశం లేదు. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్టానానికి సంబంధించిన పోటీ మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ ల మధ్య మాత్రమే కొనసాగే ఆస్కారం ఉంది. పవన్ రాజకీయాల బాటపట్టి సినిమాలకు దూరం కావడంతో మళ్ళీ పవన్ ఇప్పట్లో సినిమాలలో నటిస్తాడో క్లారిటీ లేదు. 
Mahesh Babu's Bharat Ane Nenu stresses about 'Education System'
చిరంజీవి సినిమాలలో నటిస్తూ ఉన్నా చాల తక్కువ సినిమాలు చిరంజీవి చేసే ఆస్కారం ఉన్న నేపధ్యంలో అనుకోకుండా వచ్చిన ఈ ‘ఆర్ ఆర్ ఆర్’ గ్యాప్ ను మహేష్ తన నెంబర్ వన్ స్థానానికి ఉపయోగపడే విధంగా మలుచుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది 2019 మొదలు 2020 లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే లోపు మహేష్ తన వైపు నుంచి ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘మహర్షిని’ కలుపుకుని సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యేలోగా తనకు సంబంధించిన నాలుగు సినిమాలు విడుదల చేసి తన ఇండస్ట్రీ ఆదిపత్యాన్ని నిలబెట్టుకోవాలని స్థిర నిశ్చయంలో ఉన్నట్లు టాక్.
Mahesh Babu's Bharat Ane Nenu Will Be Dubbed In Hindi, Confirms Director
వచ్చే ఏడాది ఫిబ్రవరితో మహేష్ ‘మహర్షి’ పూర్తి అవుతుంది కాబట్టి ఆ సమయానికి సుకుమార్ తన కథతో రెడీగా ఉండమని ఇప్పటికే మహేష్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు సుకుమార్ తో సినిమాను చేస్తూనే 2020 లో తాను నటించబోయే సినిమాల కథల ఎంపిక గురించి దర్శకుల నిర్ణయం గురించి మహేష్ అన్ని కోణాలలో ఆలోచిస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల ఏర్పడ్డ స్టార్ హీరోల సినిమాల గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడు అంటూ సంకేతాలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: