నిన్నరాత్రి హైదరాబాద్ గచ్చిబోలీలో జరిగిన ఒక డాన్స్ షోలో అల్లు అర్జున్ తన సోదరులు ఇద్దరితో కలిసి చేసిన హడావిడి ఆ డాన్స్ షోకు హైలెట్ గా మారింది. అయితే అంత మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ సందడి చేసిన బన్నీ అట్లతద్ది రోజున తన రూపు మార్చుకుని తన భార్య స్నేహా రెడ్డితో కలిసి సాంప్రదాయంగా పూజలు చేస్తూ చేసిన హడావిడికి సంబంధించిన ఫోటోలను కూడ బన్నీ భార్య సోషల్ మీడియాలో లీక్ చేసింది. 

దీనితో బన్నీ ఊసరవెల్లి లా రాత్రి ఒకలాగ ఉదయం ఒకరకంగా కనిపిస్తూ సందడి చేస్తున్న ఫోటోలు బన్నీ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. వ్యాపార వ్యవహారాల్లో సినిమాలలో ఎప్పుడు బిజీగా ఉండే అల్లు బ్రదర్స్ కలిసి నిన్న రాత్రి జరిగిన డాన్స్ షోలో సందడి చేయడం వారి సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది అంటూ అప్పుడే బన్నీ అభిమానులు కామెంట్స్ కూడ పెడుతున్నారు. 
Image may contain: 1 person, glasses
సాధారణంగా అల్లు అర్జున్ అన్న బాబీ ఇలాంటి డాన్స్ షోలకు ఫిలిం ఫంక్షన్స్ కు చాల దూరంగా ఉంటాడు. అయితే ఈముగ్గుర్ని నిన్న జరిగిన డాన్స్ షో కలిపింది. గాగుల్స్ తో విభిన్నమైన పబ్ లైటింగ్ లో వెరైటీ గా అనిపిస్తున్న అల్లు బ్రదర్స్ కు సంబంధించిన ఈ లుక్ ట్రెండీగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 
allu arjun, Naa Peru Surya, Naa Illu India
‘నాపేరు సూర్య’ పరాజయంతో షాక్ లోకి వెళ్ళిపోయిన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో తన సినిమా ఫైనల్ అయిన నేపధ్యంలో ఇలా తన సోదరులతో కలిసి నిన్న హంగామా చేసుకున్నాదనుకోవాలి. అయితే ఈ హంగామా ఫోటోలను చూసిన బన్నీ అభిమానులు మాత్రం వేరే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అన్నయ్య బాబీ నిర్మాణంలో తమ్ముడు శిరీష్ తో కలిసి బన్నీ ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ పెడుతున్న కామెంట్స్ కు బన్నీ వైపు నుండి ఎటువంటి స్పందన ఉందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: