నేచురల్ స్టార్ నాని అతి తక్కువ కాలంలో తన ఇమేజ్ పెంచుకుని దానితో పాటు తన పారితోషికం కూడ భారీగా పెంచాడు. ఒకానొక దశలో టాప్ యంగ్ హీరోల స్థాయికి నాని చేరిపోతాడా అన్న అనుమానాలు కూడ కలిగాయి. అయితే అనూహ్యంగా ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ సినిమాలు వరస పరాజయం చెందడంతో నాని తన క్రేజ్ పడిపోకుండా తన వ్యూహాలు మార్చుకోవడమే కాకుండా తన నిర్మాతలకు నాని ఇప్పుడు ఇస్తున్న ఆఫర్లు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారాయి. 
Nani-Jersey
తెలుస్తున్న సమాచారం మేరకు నాని లేటెస్ట్ గా మొదలు పెట్టిన ‘జెర్సీ’ చిత్రానికి రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోవడం లేదు అని వార్తలు వస్తున్నాయి. లాభాల్లో వాటా తీసుకుంటానని నాని చెప్పడంతో నిర్మాతలే యాభై శాతం వాటా ఇస్తామని చెప్పారట. అంటే సినిమాకి లాభాలు వస్తేనే నానికి పారితోషికం వస్తుంది. 
Hero Nani JERSEY movie FIRST LOOK Teaser fanmade
ఒకవేళ ఈమూవీ పరాజయం చెందితే నాని ఈసినిమా గురించి పడిన కష్టం అంతా వృథా అయిపోతుంది. నాని డబ్బులు లెక్క చేయకుండా ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని భావించి తనంతట తానుగా ఈ ప్రపోజల్‌ పెట్టాడని టాక్. ఈమూవీ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నాని నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు టాక్.  

అంతేకాదు ఒకవేళ ఈ చిత్రం కనుక ఆశించిన ఫలితం సాధించకపోతే మరో చిత్రం ఈసినిమా నిర్మాతలకు చేస్తానని నాని మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయోగం సక్సస్ అయితే మన టాప్ హీరోలను కూడ ఇలాంటి పద్దతికి అలవాటు పడమని మన నిర్మాతలు అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: