కోలీవుడ్ లో స్టార్ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి సినిమాలు ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.   న‌వంబ‌ర్ 6న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా విడుద‌లై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది.  కీర్తి సురేశ్‌, వరలక్ష్మీ ప్రధాన పాత్రల్లో న‌టించారు.  అయితే ఈ సినిమాపై మొదటి నుంచి రక రకాల వివాదాలు చుట్టు ముట్టుతున్నాయి.  'సర్కార్' సినిమాకు సౌతిండియన్ ఫిల్మ్ రైట్స్ అసోసియేషన్ నుంచి ఊహించని షాక్ తగిలింది.
Image result for sarkar movie telugu
ఈ సినిమా కథ తనదే అని, దాన్ని మురుగదాస్ కాపీ కొట్టాడంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్ చేస్తున్న వాదనకు మద్దతు ప్రకటించింది. ఇటీవల కాలంలో స్టోరీ కాపీ రైట్స్ పై జరుగుతున్న రచ్చ తెలియనిది కాదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు ఈ సెగ బాగా తగులుతోంది. ఇదే క్రమంలో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న మురుగదాస్ – విజయ్ ల “సర్కార్” సినిమాకు కూడా ఈ స్టోరీ సెగ తగిలింది. 2007లో వరుణ్ రాజేంద్రన్ రాసుకున్నసెంగోల్' టైటిల్‌తో తాను రాసుకున్న స్క్రిప్టును మురుగదాస్ కాపీ కొట్టారని వరుణ్ రాజేంద్రన్ ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరిపిన రచయితల సంఘం.... మురుగదాస్ మూవీ స్క్రిప్టు వరుణ్ రాసుకున్న స్క్రిప్టును పోలి ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో  తనకు రూ.30లక్షల నగదు, టైటిల్స్‌లో స్టోరీ క్రెడిట్‌ ఇవ్వాలని డిమాండ్‌చేసినట్లు తెలుస్తోంది.
మురుదాస్ ఒప్పుకోలేదు
అయితే ఈ విష‌యాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటున్నాడు మురుగ‌దాస్. వ‌రుణ్ అనే వ్య‌క్తి క‌థ త‌న‌దే అన‌డం ప‌బ్లిసిటీ కోసం చేసేదే త‌ప్ప ఇందులో నిజం లేదు.  రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్టుకు ఎక్కారు. మద్రాస్ హై కోర్టు ఈ కేసును అక్టోబర్ 30న విచారించనుంది. అయితే మురుగదాస్ మీద కాపీ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కత్తి సినిమా సమయంలో కూడా ఆయన కథపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ విషయం  తనను బాగా కలచివేసిందని, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనయ్యిందని, అయినా సినిమా చూడకుండా తన కధే ఇదని వరుణ్ ఎలా అంటారని తీవ్ర ఆవేదనతో మురుగదాస్ చెప్పుకొచ్చారు. ‘సర్కార్’ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించినపుడు ఈ కధ వివాదం మొదలుకాగా, ఇపుడు సినిమా దాదాపుగా విడుదలకు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: