ఈ మద్య బాలీవుడ్ లో కొంత మంది మోడల్స్, నటీమణులు హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  ఈ సోషల్ మీడియా ద్వారా కొందరు పెట్టే పోస్టులు వివాదాస్పదం అవడం, నెటిజన్ల ఆగ్రహానికి గురికావటం జరుగుతోంది.  తాజాగా బాలీవుడ్ లో పలు సీరియళ్లు, సినిమాలలో నటించిన శ్వేతా సాల్వే ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకి వెళ్లింది. అక్కడ బికినీలో స్మోక్ చేస్తూ తీసుకున్న ఫోటోని శ్వేతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా చేయడానికి మీకు సిగ్గు లేదా..? అంటూ ఆమెను వ్యక్తిగతంగా దూషించారు. 

మరికొందరు మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లే వస్తాయంటూ కామెంట్లు పెట్టారు.  ఈ నేపథ్యంలో శ్వేతా సాల్వే ఘాటుగా స్పందించింది.   ‘‘అవును నేను దూమపానం, తాగటం లాంటివి చేసినా కూడా నిజాయితీగా ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను పద్దతిగానే పెంచారు. నా పిల్లల విషయంలో నేను నిర్లక్యంగా ఉండటం మీరు చూశారా? అయినా నిత్యం ఎన్నో పనులతో బిజీగా ఉండే నా వ్యక్తిగత విషయాల పట్ల మీరు ప్రశ్నించొద్దు. 
Image result for శ్వేతా సాల్వే ఫైర్
మీకు నచ్చక పోతే నన్ను ఫాలో కాకండి అంతే’’ అని రిప్లై ఇవ్వటం విశేషం. అంతేకాదు.. మ‌ళ్లీ అదే పొగ తాగుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ భామ చేస్తోన్న ప‌నుల‌పై కొంద‌రు నెటిజ‌న్లు గుర్రుగానే ఉన్నారు కానీ ఇది నా సొంత హ‌క్కు అంటూ శ్వేతా మాత్రం న‌చ్చింది చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: