లాస్ట్ ఫ్రై డే రిలీజైన మల్టీస్టారర్ మూవీ వీర భోగ వసంత రాయలు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు కలిసి నటించిన సినిమా అది. రివ్యూయర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఇదేం సినిమారా బాబు అని వారి బాధను చెప్పుకున్నారు. అయితే కేవలం రివ్యూస్ ప్రభావం వల్లే తన సినిమా పోయిందని ఫీల్ అయ్యే ఆ సినిమా దర్శకుడు ఫక్ ఆల్ రివ్యూస్ అంటూ ఓ సంచలన పోస్టర్ రిలీజ్ చేశాడు.


వీర భోగ వసంత రాయలు సినిమా దర్శకుడు ఇంద్రసేన పెట్టిన ఆ స్టేట్మెంట్ పై సినిమాలో నటించిన ఆ ముగ్గురు హీరోలు ఫైర్ అయ్యారట. వెంటనే అతనికి ఫోన్ చేసి క్లాస్ పీకారట. ఆ స్టేట్మెంట్ నువ్వు ఒక్కడివే ఇచ్చినట్టు అవదని చెప్పారట. ఇక ఇంతలోనే శ్రీవిష్ణు ప్రస్తుతం ఇంద్రసేనతో దూరంగా ఉంటున్నట్టు చెప్పి రివ్యూల మీద తనకు గౌరవం ఉంది అన్నాడు.


అసలు తను తీసింది ఓ అద్భుత కళాకండం అన్నట్టుగా దానికి రివ్యూయర్స్ ఏదో రివ్యూ సరిగా ఇవ్వలేదు అన్నట్టుగా ఫక్ ఆల్ రివ్యూస్ అని పోస్టర్ వదలడం దర్శకుడి నిస్సహాయస్థితి తెలియచేస్తుంది. కోపం, ఆవేశం, కసి ఇదేదో సినిమా తీసేప్పుడు పెట్టుకుని జాగ్రత్తగా తీస్తే బాగుండేది.   


అయినా పోయిన ప్రతి సినిమా రివ్యూల వల్లే పోయిందని అనుకుంటే ఎలా అంటున్నారు రివ్యూ రైటర్స్. ఒకవేళ సినిమాను కావాలని రివ్యూ రైటర్స్ తొక్కేసినా చూసిన ఆడియెన్స్, వచ్చిన కలక్షన్స్ వాటికి సమాధానం చెబుతాయి కదా. మొత్తానికి తన అపజయాన్ని రివ్యూస్ మీద నెట్టేద్దామనుకున్న ఇంద్రసేన మరో మంచి ప్రయత్నం చేయాలని ప్రయత్నించకుండా ఇలా కోపంతో ఎలా పడితే అలా అంటే సోషల్ మీడియాని తట్టుకోవడం కష్టమే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: