తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చారు.  కానీ ఏ ఒక్కరూ ఇండస్ట్రీలో కనీసం రెండు మూడు చిత్రాల్లో నటించలేదు.  మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం వరుసగా ఇండస్ట్రీలో ఛాన్స్ లు దక్కించుకుంటూ..స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.  ఆ మద్య తెలుగు యంగ్ హీరోలు తమ పక్కన రకూల్ అయితు బాగుంటుందని దర్శక, నిర్మాతలకు చెప్పేవారని టాక్.  ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా నటిస్తుంది. 

స్వతహాగా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన రకూల్ గ్లామర్ విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా నటిస్తుంది.  ఆ మద్య రకూల్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.  నటిగానే కాకుండా రకూల్ వ్యాపార రంగంలో కూడా తన సత్తా చాటుతుంది.  ఇప్పటికే హైదరాబాద్ లో ఫిట్ నెస్ సెంటర్ నడిపిస్తుంది.  ఇక  సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతిదీ పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు ఆ పోస్టింగే రకూల్ ని బండబూతులు తిట్టించుకునేలా చేసింది.   ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.  మనలోని చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండిపోనివ్వాలి  అంటూ అమ్మడు అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌తో ఫోటో పెట్టింది. నీ జాకెట్ చాలా చెత్తగా ఉంది అని ఒకరు, బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని..ఈ మద్య  అవకాశాల్లేక, డబ్బుల్లేక రోడ్ పక్కన కొన్న డ్రెస్సులు వేసుకుంటున్నావా? నా దగ్గరకు రా నేను కొనిస్తా అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: