రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఈసినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ ముహూర్తాన్ని తనకు బాగా నమ్మకం ఉన్న రాబోతున్న కార్తీక మాసంలో ఫిక్స్ చేయడమే కాకుండా ఈసినిమాకు సంబంధించి మూడు భారీ సెట్ల నిర్మాణం కూడ పూర్తి చేసాడు జక్కన్న. వాస్తవానికి నవంబర్ లో మొదలు కాబోతున్న ఈమూవీ షెడ్యూల్ ను కనీసం 10 రోజులైనా కొనసాగించాలి అని రాజమౌళి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు.

అయితే రామ్ చరణ్ బ్యాడ్ ప్లానింగ్ రాజమౌళి ఆలోచనలను పూర్తిగా ముందుకు సాగానీయడం లేదు అని తెలుస్తోంది. వాస్తవానికి చరణ్ జూనియర్ లను తన సినిమాలకు సంబంధించిన పనులను సెప్టెంబర్ తో పూర్తి చేసుకోమని పదేపదే రాజమౌళి చెప్పాడని టాక్. తనతండ్రి హరికృష్ణ చనిపోయినా ఆబాధను పక్కకు పెట్టి జూనియర్ అక్టోబర్ మిడిల్ ప్రాంతానికి ఫ్రీ అవ్వడమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ లో తన లుక్ కు సంబంధించిన చర్చలు రాజమౌళి సూచనలతో తన ఫిజికల్ ట్రైనర్ తో చేస్తున్నాడు.
RRR,SS Rajamouli,Ram Charan Teja
అయితే చరణ్ ఇంకా బోయపాటి ఉచ్చులోనే చిక్కుకు పోవడంతో డిసెంబర్ మధ్యకు కానీ చరణ్ తన సినిమా బాధ్యతల నుండి బయటపడే ఆస్కారం కనిపించడం లేదు. దీనితో రాజమౌళి అనుకున్న విధంగా ఈసినిమాను నవంబర్ లో మొదలుపెట్టి చరణ్ లేని సన్నివేశాలను జూనియర్ పై తీస్తూ షూటింగ్ మొదలు పెట్టాలా లేదంటే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి వరకు వాయిదా వేయాలా అన్న అయోమయంలో ఉన్నట్లు టాక్. 
Ram Charan and Rajamouli
డిసెంబర్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి ఉన్న నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను డిసెంబర్ లో మొదలు పెడితే తాను పూర్తి శ్రద్ధ పెట్టలేను అని రాజమౌళి ఆలోచన అని తెలుస్తోంది. దీనితో చరణ్ కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జనవరికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి టాప్ డైరెక్టర్ చెప్పిన టైమ్ డెడ్ లైన్ ను పట్టించుకోకుండా చరణ్ వ్యవహరిస్తున్న తీరు అతడి బ్యాడ్ ప్లానింగ్ కు నిదర్శనం అంటూ కొందరు చరణ్ పై వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: