డిసెంబర్ లో జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో అల్లు అర్జున్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడా లేదా అన్న సందేహాలు కొనసాగుతున్న నేపధ్యంలో ఆసందేహాలకు సమాధానాలు దొరకకుండానే అల్లు అర్జున్ ప్రచారానికి సంబంధించిన వార్తలు రావడం హాట్ న్యూస్ గా మారింది.

ఆశ్చర్యకరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ రాబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుండి తెలుగుదేశ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ప్రముఖ విద్య సంస్థల అధినేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విజయం కోసం బన్నీ రంగంలోకి దిగే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీనికి కారణం చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి తండ్రి.
Allu Arjun Images Download
దీనితో తన మావగారి విజయం కోసం బన్నీ ఎన్నికల ప్రచార రంగప్రవేశం ఖాయం అని అంటున్నారు. గత ఎన్నికలలో చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసినా ఆయన ఓడిపోయాడు. అయితే ఈసారి జరగబోతున్న ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేయాలి అన్న పట్టుదలతో బన్నీ మావగారు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్న మహాకూటమి ద్వారా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని తిరిగి పరీక్షించుకోబోతున్నాడు. 
Allu Arjun Next Movie Confirmed With Top Director Krish
వాస్తవానికి పవన్ కళ్యాణ్ చిరంజీవిలు రాబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇవ్వబోతున్నారు అన్నవార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ చిరంజీవిల ఇష్టానికి వ్యతిరేకంగా అల్లుఅర్జున్ రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తాడా ? లేదంటే పరోక్షంగా తన ఫోటోలను తన మామయ్య ఎన్నికల ప్రచార ఫ్లేక్సీల వరకు పరిమితం చేసి తన మామయ్యను గెలిపించమని పరోక్షంగా పవన్ అనుసరిస్తున్న వ్యూహాన్ని అనుసరిస్తాడా అన్న ఆసక్తి మెగా అభిమానులలో ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: