ఇండియా లో ఇప్పడూ మీ టూ ఉద్యయం ఊపందుకున్నది. ప్రతి ఒక్కరు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే మీటూ ఉద్యమం బాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో కూడా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ ఓ సౌత్ ఇండియన్ హీరోపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అమైరా దస్తూర్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

స్టార్ హీరో అల్లుడు

తెలుగులో ఈ భామ మనసుకు నచ్చింది, రాజు గాడు వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అమైరా దస్తూర్ నటించిన సౌత్ చిత్రాలకు సరైన గుర్తింపు లభించలేదు. మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో అమైరా దస్తూర్ చేసిన ఆరోపణలు కలకలం సృస్తిస్తున్నాయి. తనని ఓ స్టార్ హీరో అల్లుడు లైంగికంగా వేధించాడని అమైరా దస్తూర్ ప్రకటించింది. అతడి పేరు బయటకు చెబితే నా జీవితం నాశనం అవుతుంది. అందుకే పేరు చెప్పడం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బట్టబయలు చేస్తా అంటూ అమైరా దస్తూర్ వ్యాఖ్యానించింది.

అవకాశాలు రాకపోయినా

తనకు సౌత్ లో అవకాశాలు రాకపోయినా పరవాలేదు. బాలీవుడ్ కంటే ఇక్కడే వేధింపులు ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హీరోని వదలిపెట్టేది లేదని అమైరా దస్తూర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అతడితో కలసి ఓ చిత్రంలో నటించాను. షూటింగ్ లో వేధించుకు చంపాడని అమైరా వాపోయింది. షూటింగ్ లో అసభ్యంగా చేయి వేసి ఇబ్బంది పెడుతుండేవాడు. అతడికి ఉన్న పలుకుబడి దృష్ట్యా బయటకు చెప్పడానికి భయమేసింది. కానీ ఒకరోజు ధైర్యం చేసి దర్శకుడికి చెప్పానని అమైరా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: