Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:17 pm IST

Menu &Sections

Search

'సవ్యసాచి' పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

 'సవ్యసాచి' పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
'సవ్యసాచి' పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నట వారసుడిగా ‘జోష్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య.  ఆ చిత్రం పెద్దగా హిట్ కాకపోయినా..తర్వాత వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో నాగ చైతన్య లవర్ బాయ్ గా కనిపించాడు.  అయితే ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ పెంచుకుంటేనే కొంత కాలం నిలబడుతారన్న సూక్తి గమనించిన చైతూ ఎక్కువగా యాక్షన్ తరహా చిత్రాలకే ప్రాదాన్యత ఇస్తున్నారు.  కానీ ఆ తరహా చిత్రాలు తీసినప్పుడల్లా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. 
savyasachi-movie-director-chandu-mondeti-naga-chai
తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, నవంబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది.  ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..'సవ్యసాచి' ట్రైలర్ చూసినవాళ్లు .. 'హలో బ్రదర్' మాదిరిగా ఉందని అనుకుంటున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఆ  సినిమాకి .. ఈ సినిమాకి ఏ విషయంలోనూ పోలిక ఉండదు' అని క్లారిటీ ఇచ్చాడు. అసలు ఈ చిత్రానికి కవల పిల్లకు ఉండే రిలేషన్ కి ఏ సంబంధం ఉండదని..కొన్ని సంవత్సరాల క్రితం 'వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' గురించిన ఒక ఆర్టికల్ చదివాను.
savyasachi-movie-director-chandu-mondeti-naga-chai
ఈ రకమైన సిండ్రోమ్ కలిగినవారికి ఒక చేయి అదుపులో ఉండదు. ఇది నాకు కాస్త చిత్రంగా అనిపించింది. ఈ పాయింట్ పై సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది.  ఈ కథపై చాలా వరకు రిసెర్చ్ చేసి ఓ మంచి కథను రెడీ చేసుకొని చైతూతో పాటు నిర్మాతలకి వినిపించాను. అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రధాన అంశాలుగానే ఈ కొత్త కాన్సెప్ట్ ను తీర్చిదిద్దాను. ఈ చిత్రం చూస్తే కొత్త అనుభూతి పొందుతారు అని అంటున్నారు దర్శకులు. 



savyasachi-movie-director-chandu-mondeti-naga-chai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.