బాలీవుడ్ లో 90వ దశకంలో ప్రైవేట్ ఆల్బామ్స్ ఎంతో మంది సింగర్లు వెలుగులోకి వచ్చారు.  అందులో ప్రముఖ సింగర్ షాన్ ఒకరు.  ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా షాన్ పాడారు.  ప్రస్తుతం ప్రైవేట్ ప్రొగ్రామ్స్ లో పాడుతున్న షాన్ పై అస్సాం వాసులు మండిపడ్డారు. గౌహతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గీతాలను ఆలపించడానికి వచ్చిన షాన్ పై వారు రాళ్ల దాడి చేశారు. అసలు విషయానికి వస్తే..నిన్న గౌహతిలోని సారుసజాయ్ స్టేడియంలో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్‌లో షాన్ ఓ బెంగాలీ గీతాన్ని ఆలపించారు.  అయితే షాన్ బెంగాలీలో పాడటం అక్కడి వారికి నచ్చలేదు..షాన్ గారూ..ఇది బెంగాలీ కాదు..అస్సాం ఈ విషయాన్ని గమనించి పాడాలని డిమాండ్ చేశారు.
Image result for singer shaan
అంతే కాదు కొంత మంది ఆకతాయిలు పేపర్ బాల్స్‌తో.. రాళ్లతో దాడి చేశారు.  దీనిపై షాన్ స్పందించి ప్రోగ్రామ్ మద్యలోనే వెళ్లి పోతానని అనడంతో నిర్వాహకులు బతిమలాడి పాడించారు.  ఆ తర్వాత షాన్ మాట్లాడుతూ..ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు. కళాకారుల పట్ల ఎప్పుడూ ఇలా ప్రవర్తించవద్దు  అని తెలిపారు. తాను జ్వరంతో బాధపడుతున్నా.. అస్సాంలో తన పాటలంటే ఇష్టపడే వారి కోసం ఇంత దూరం వచ్చానని ఆయన తెలిపారు. 
Image result for singer shaan
కాగా, ఈ ఘటనై ఓ అస్పామీ షాన్ కి ఈ విధంగా ట్విట్ చేశారు. కొంత మంది ఆకతాయిలు మీ పట్ల దురుసుగా ప్రవర్తించడం చాలా బాధాకరం..అందుకు నేను క్షమాపణలు కోరుకుంటున్నానని అన్నారు.  దానికి సమాధానంగా షాన్ కూడా ట్విట్ చేస్తూ.. ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు అని.. యువత ఆ ట్రాప్‌లో పడకూడదని హితవు పలికారు. కాగా, షాన్ బాలీవుడ్ లోనే కాదు కన్నడం, తెలుగు, బెంగాలీ, ఆంగ్లం, మలయాళం, ఒరియా, అస్సామీ భాషలలో కూడా పాటలు పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: