రచయితగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి అదరగొట్టాడు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు అతని సినిమా అంటే సినిమాలో ఓ మెసేజ్ తో పాటుగా స్టార్ హీరో ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ హంగులు ఉండేలా చూసుకున్నాడు. మహేష్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫిక్స్ చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట.


డిసెంబర్ నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. ఖైది నంబర్ 150 తర్వాత చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ సినిమానే ఉంటుంది. అయితే చిరు సినిమా తర్వాత కూడా కొరటాల శివ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని అంటున్నారు.  


అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో స్టార్ రేంజ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండతో కొరటాల శివ సినిమా లైన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ తన పంథాకు వ్యతిరేకంగా కమర్షియల్ హంగులతో ఈ సినిమా కథ రాస్తున్నాడట. కొరటాల శివ సినిమాలు మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటాయి.


అయితే విజయ్ దేవరకొండ కోసం ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నాడట కొరటాల శివ. ఆ సినిమా కథే అద్భుతంగా ఉంటుందని అంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. ప్రస్తుతానికి లైన్ మాత్రమే ఉండగా విజయ్ కు చెప్పగా కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫుల్ స్క్రిప్ట్ పూర్తిచేసి విజయ్ దేవరకొండకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడట కొరటాల శివ.



మరింత సమాచారం తెలుసుకోండి: