ఒకప్పుడు తమిళ సినిమాలు దాదాపు అన్ని కూడా మన దగ్గర స్ట్రైట్ సినిమాల్లానే రిలీజై సూపర్ సక్సెస్ అందుకునేవి. ఒకానొక దశలో తమిళ సినిమాలు ఇక్కడ సాధించిన వసూళ్లు తెలుగు స్టార్స్ ను సైతం ఆశ్చర్యపడేలా చేశాయి. అయితే రాను రాను పరిస్థితి మారింది. తెలుగు సినిమాలు తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. 


ఇక్కడ స్టార్స్ కూడా అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో అంతగా ప్రేక్షకాదరణ దక్కడం లేదు. అయినా సరే సూర్య, కార్తి, విక్రం లాంటి హీరోల సినిమాకు తమిళంతో పాటుగా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్య విశాల్ కాస్త పుంజుకున్నాడు.


అయితే తమిళంలో సూపర్ స్టార్డం ఏర్పరచుకున్న విజయ్ కు తెలుగులో అసలు ఫాలోయింగ్ లేదు. ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి అంతగా ఆడలేదు. విజయ్ ఎప్పుడు తెలుగు డబ్బింగ్ మీద అంతగా దృష్టి పెట్టలేదు. ఇక రిలీజ్ టైంలో కూడా ఇక్కడ ప్రమోషన్స్ కు రాలేదు. అయితే ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సర్కార్ సినిమాకు మాత్రం ప్లాన్ మార్చాడట విజయ్.


తెలుగు మార్కెట్ పై కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సర్కార్ ను భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడని తెలుస్తుంది. వల్లభనేని అశోక్ తెలుగులో సర్కార్ ను రిలీజ్ చేస్తున్నాడు. తెలుగు రెండు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో సర్కార్ రిలీజ్ కానుంది. తమిళంలో 700 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే అక్కడ కన్నా ఎక్కువ సెంటర్స్ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. పోటీగా సినిమాలు కూడా లేవు కాబట్టి విజయ్ సర్కార్ తెలుగులో సత్తా చాటుతాడా లేడా అన్నది చూడాలి. సర్కార్ సినిమా తెలుగు రైట్స్ 8 కోట్లకు కొన్నాడట వల్లభనేను అశోక్. రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఎక్కువ కాబట్టి ఈ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: