పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి నిన్న ‘జనసేన’ ఆఫీసుకు వచ్చి పవన్ ను ఆశీర్వదించడమే కాకుండా పవన్ పార్టీకి 4 లక్షల విరాళం ఆమె ఇచ్చింది. అయితే ఈకార్యక్రమానికి అంజనా దేవితో పాటు కలిసి వచ్చిన పవన్ లుక్ ను చూసి మీడియా వర్గాలు ఆశ్చర్యపోయాయి. పూర్తిగా షేవ్ చేసుకుని తిరిగి హీరో లుక్ లో టక్ చేసుకుని నీట్ గా కనిపించిన పవన్ లుక్ చూసినవారు ఇంతలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కు ఏమైంది అని కామెంట్స్ చేసుకోవడమే కాకుండా ఎన్నికలలోపు పవన్ మరో సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడా అంటూ మీడియా వర్గాలు గుసగుసలు ఆడుకునట్లు టాక్.
Great Gesture by Anjana Devi to Pawan Kalyan Jana Sena
అయితే పవన్ ఇలా హఠాత్ గా తన లుక్ మార్చడానికి మూడు కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాపోరాట యాత్రలో పంచెకట్టు పైజామాతో కనిపించిన పవన్  ఇలా నీట్ గా ఇన్ షర్ట్ చేసి బెల్ట్ పెట్టి సినిమా స్టైల్లోకి మారిపోవడం వెనుక పవన్ త్వరలో తన ఛానల్ లో నిర్వహించబోతున్న చర్చా కార్యక్రమాలకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనడానికి ఇలా గెటప్ మార్చాడు అన్న ప్రచారం జరుగుతోంది.

దీనికితోడు పవన్ కు ప్రస్తుతం అత్యంత ఆత్మీయుడుగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ సలహాలతో కూడ పవన్ ఇలా గెటప్ మార్చాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈ గెటప్ చేంజ్ వెనుక కొన్ని ఆరోగ్యకారణాలు కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ తన పెంచిన గడ్డాన్ని నల్లగా ఉంచుకునే విషయంలో పవన్ వాడుతున్న హెయిర్ డైలు పవన్ కు ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నాయి అని అంటున్నారు. అయితే పవన్ అభిప్రాయాలు లాగే పవన్ గెటప్ లు కూడ రకరకాలుగా మారిపోవడం వల్ల పవన్ కు వచ్చే ఇమేజ్ కన్నా పవన్ పై పెరిగిపోయే సేతైర్లకు కారణం అవుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: