తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మురుగదాస్ ఇప్పటి వరకు ఏ సినిమా తీసినా దానిలో ఏదో ఒక మెసేజ్ ఉంచడం చూస్తూనే ఉన్నాం.  ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘సర్కార్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా పై మొదటి నుంచి రక రకాల వివాదాలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ‘సర్కార్’ కథ తనదే అంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 12 సంవత్సరాల క్రితమే 'సెంగోల్' అనే పేరుతో ఈ కథను రిజిస్టర్ చేసుకున్నాననీ, ఆ కథకి కొన్ని మార్పులు చేసి మురుగదాస్ 'సర్కార్' సినిమా చేశాడని ఆయన పేర్కొన్నారు.   
Image result for vijay sarkar movie
కాగా, ఈ సినిమా  రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు.   తాజాగా దీనిపై చిత్ర దర్శకుడు మురగదాస్ స్పందించారు. కొన్ని నెలల పాటు జరిపిన చర్చలతో ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్టు ఆయన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు.  ఈ సినిమా కథ  తాను కష్టపడి తయారు చేసుకున్న కథ అని చెప్పిన మురుగదాస్, విడుదల వాయిదా పడితే నష్టం భారీగా ఉంటుందని అన్నారు. 
Image result for vijay sarkar movie
ఈ సినిమాలో నేటి ఎన్నికల పరిస్థితి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపానని.. నకిలీ ఓట్లు సృష్టించి ప్రజాభిప్రాయానికి తావు లేకుండా చేయడం చాలా పెద్ద నేరం. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించాను. రుణ్‌ అనే రచయితకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది. తన స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించికున్నారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ సర్కార్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నాదే అని తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు మురుగదాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: