కాజల్ కలువ కళ్ళ సుందరి. అందం పందిరి వేస్తే ఈ సుందరిలాగానే ఉంటుంది. చిలిపి కళ్ళతోనే రొమాన్స్ చేసే ఈ చిన్నది తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసింది. అచ్చం చందమామలా అనిపించే కాజల్ బ్యూటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య కాస్త చాన్సులు తగ్గినా మళ్ళీ నేనే అంటోంది. 


తమిళంలో సీనియర్ హీరో కమల్ హాసన్ పక్కన కాజల్ నటిస్తోందట. కమల్ తొందరలోనే తన కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు. అప్పట్లో అంటే దాదాపు 22 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు పెద్ద హిట్ అయింది. అవినీతికి వ్యతిరేకంగా తీసిన ఈ సెన్సేషనల్ మూవీకి డైరెక్టర్ శంకర్. తిరిగి ఈ కాంబోతోనే భారతీయుడు 2 రాబోతోందిట. ఇందులోనూ అవినీతికి వ్యతిరేకంగానే కధ ఉంటుందని చెబుతున్నారు.


ప్రస్తుతం రజనీ 2.0 మూవీతో బిజీగా ఉన్న శంకర్ అది పూర్తి కాగానే కమల్ తో సినిమాను సెట్స్ మీదకు తెస్తారట. ఈ మూవీకి కాజల్ పెయిర్ అని డిసైడ్ అయ్యారట. కాజల్ కూడా సీనియర్ హీరో కమల్ పక్కన యాక్ట్ చేయడానికి రెడీ అంటోదని టాక్. అదే జరిగితే ఈ చిన్నది సీనియర్ హీరోలకు ఇక జై కొట్టినట్లే.


తెలుగులో కూడా కాజల్ ని సీనియర్లు అడుగుతున్నారు. ఇప్పటికే చిరంజీవితో నటించిన కాజల్ నాగ్, వెంకీ, బాలయ్యల పక్కన కూడా తొందరలోనే మెరిసిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కెరీర్ ఇపుడు మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే సీనియర్ హీరోలతో జోడీ కట్టడమే ఆప్షన్ అని కాజల్ భావిస్తోందట. అయితే తన  పాత్ర బాగా ఉండాలని మాత్రం షరతులు పెడుతోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: