ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుత తరం యూత్ కు ఐకాన్ గా మారిపోయిన నేపధ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానుల సంఖ్యతో పాటు అతడి యాంటీ ఫ్యాన్స్ సంఖ్య కూడ విపరీతంగా పెరుగుతోంది. అంతేకాదు చాలామంది యంగ్ హీరోలు విజయ్ దేవరకొండను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే.
Rahul Ramakrishna
ఇలాంటి పరిస్థుతులలో విజయ్ దేవరకొందతో కలిసి సినిమాలు చేయడమే కాకుండా అతడితో చాలా సన్నిహితంగా ఉండే రాహుల్ రామకృష్ణ విజయ్ దేవరకొండకు రోజురోజుకు పెరిగిపోతున్న అతడి యాంటీ ఫ్యాన్స్ విషయం తన దృష్టి వరకు వచ్చినా తనకు ఈవిషయానికి సంబంధించి స్పష్టమైన కారణాలు చెప్పలేను అంటూ వ్యూహాత్మక సమాధానం ఇచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ సినిమాలలో రాహుల్ రామకృష్ణ విజయ్ తో కలిసి కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. 
Rahul Ramakrishna wiki, biography, movies list
ఇదే సందర్భంలో ఈ నటుడు విజయ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ అతడు టాప్ హీరోగా మారిపోతూ ఉన్నా తనలాంటి చిన్న నటులతో చాలా స్నేహంగా ఉంటాడని వాస్తవానికి విజయ్ కి ఇగో లేదు అంటూ ప్రశంసలు కురిపించాడు. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలకు కూడ యాంటి ఫ్యాన్స్ ఉన్న నేపధ్యంలో విజయ్ కు యాంటీ ఫ్యాన్స్ ఉండటంలో ఆశ్చర్యం లేదు అని అంటున్నాడు. 
Vijay Deverakonda and Rahul Ramakrishna in Arjun Reddy (2017) Vijay Devarakonda, Ganesh, Ms, Ganesha
వరస విజయాల తరువాత విజయ్ దేవరకొండ స్పీడ్ కు ‘నోటా’ బ్రేక్ వేయడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చేనెల విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ పై ఉంది. ఈసినిమాకు కూడ విజయ్ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ ప్రచారం చేసే అవకాసం ఉన్న నేపధ్యంలో ఈ సునామీని తట్టుకుని విజయ్ తన ‘తాక్సీవాలా’ ని నిలబెట్టుకోలేకపోతే విజయ్ దేవరకొండ పై మరింత ఒత్తిడి పెరిగే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: