తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్.  ఇప్పటి వరకు నటించిన చిత్రాలు దాదాపు అన్ని హిట్ టాక్ తెచ్చుకున్నవే.  ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.  ఈ చిత్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు రాంచర్. 
Image result for ram charan boyapati
ఈ చిత్రానికి సంబంధంచిన ఎలాంటి అప్ డేట్స్ ఇప్పటి వరకు లేవు.  కాకపోతే ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని భావించారు ఫ్యాన్స్..కానీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురైంది.  మరోవైపు ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. హీరోగా రామ్‌చరణ్‌కు ఇది 12వ చిత్రం.  ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కైరా అద్వాని నటిస్తుంది.  మరోవైపు ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు దర్శక, నిర్మాతలు.  ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అని అభిమానులు డౌట్ పడ్డారు. ఈ మూవీ వచ్చే పొంగల్‌కు విడుదలవుతుందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ఫిల్మ్ నగర్‌లో పుకార్లు షికార్లు చేశాయి.
Image result for ram charan boyapati
అయితే రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల మూవీ వచ్చే సంక్రాంతికే ఆరూనూరైనా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ విషయమై తొందర్లనే అఫీషియల్‌గా ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామా’ అనే టైటిల్‌ను ఈ మూవీ మేకర్స్ ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.  తాజాగా ఈ మూవీ టాకీ పార్ట్ నవంబర్ 10తో కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. మిగిలిన రెండు పాటలను తొందర్లనే పిక్చరైజ్ చేస్తున్నట్లు సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్‌లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: