ఈ మద్య టాలీవుడ్ లో హర్రర్, థ్రిల్లర్, కామెడీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య లభిస్తుంది.  ఈ తరహా కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతి సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.  చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు.  తాజాగా జయప్రద నటించిన ‘శరభ’ హర్రర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఎకె ఎస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా.. సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన సినిమా “శరభ”.  ఈ సినిమాకి ఎన్. నరసింహ రావు దర్శకత్వం వహించగా అశ్విన్ కుమార్ సహదేవ్ నిర్మాత. ఈ మూవీ న‌వంబ‌ర్ 15వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

Image result for jayaprada sarabha movie

ఈ సందర్భంగా నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. “సోసియో ఫాంటసీగా రూపొందిన ఈచిత్రాన్ని న‌వంబ‌ర్ 15వ తేదీన విడుదల చేయను న్నాము.  చాలా కాలం తర్వాత నటి జయప్రద తెరపై కనిపించబోతున్నారని ఆయన అన్నారు. అంత గొప్ప నటి మా సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.  త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. 

హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ.. జయప్రద లాంటి సీనియర్ నటితో నటించడం ఎంతో సంతోషంగా ఉందని..ఇలాంటి హర్రర్ మూవీలో నటించడం చాలా కష్టమని అన్నారు. జయప్రద లాంటి సీనియర్ నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. తెలుగులో ఇంత మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

నటి జయప్రద మాట్లాడుతూ..తెరపై నటించి చాలా రోజులైంది..కొంత కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చానని..ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంపై సంతోషంగా ఉందని జయప్రద అన్నారు.   సినిమా చేయాలని ఆశ పుట్టింది అయితే ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నరసింహ ఈ చిత్ర కథతో వచ్చారని.. ఆ కథ వింటుంటే చాలా నచ్చిందని అన్నారు. వాస్తవానికి ఈ సినిమా నాకు మళ్లీ న్యూ ఎంట్రీ లా అనిపిస్తోంది.. నా రీఎంట్రీ కు ఓ మలుపు తిప్పే సినిమా అవుతుందని నమ్ముతున్నా.. ఈ సినిమాలో నా పాత్ర చాలా వెరీయేషన్స్ లో ఉంటుంది ఓ రకంగా నాకు ఛాలెంజింగ్ పాత్ర. 

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్, మేకప్: నాయుడు మరియు శివ, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: రామ్- లక్ష్మణ్, డిజైనర్లు: అనిల్, భాను, కెమెరా: రమణ సాల్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆడియో గ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ ఎస్., మ్యూజిక్: కోటి, నిర్మాత: అశ్విన్ కుమార్ సహదేవ్, రచన-దర్శకత్వం: నరసింహ రావు.



మరింత సమాచారం తెలుసుకోండి: