స్క్రీన్ మీద హీరోల లిప్ లాక్ ప్రేక్షకులను అలరిస్తాయి.. అయితే అదేమంత ఈజీ పనేం కాదు. లిప్ లాక్ చేసేది హీరో, హీరోయినే అయినా చుట్టూ సినిమా టెక్నికల్ టీం ఉంటుంది. దర్శకుడు, కెమెరీ మన్ ఇలా అందరు చూస్తుండగా అలా చేయాలి. అయితే సినిమాను రక్తికట్టించడం కోసం లిప్ లాక్ చేయాల్సి ఉంటుంది. కొందరు దాన్ని అవైడ్ కూడా చేస్తారనుకోండి. ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ట్రెండీగా మారాయి.


అయితే బాలీవుడ్ లో 2012 లో వచ్చిన ఓ సినిమాలో హీరో హీరోయిన్ తో లిప్ లాక్ చేయడం వల్ల తన ఫ్యామిలీలో గొడవలు పడాల్సి వచ్చిందని తెలుస్తుంది. 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకటి విక్కీ డోనార్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ కలక్షన్స్ సాధించిన్ 100 కోట్ల క్ల్బ లో చేరింది.


ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతం జంటగా నటించారు. సినిమాలో ఓ సీన్ లో ఆయుష్మాన్, యామి ఇద్దరు ఘాటు ముద్దు పెట్టుకుంటారు. ఆ సీన్ చూసిన ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ చాలా హర్ట్ అయ్యిందట. అంతేకాదు అతన్ని వదిలేసి వెళ్లిందట. మూడేళ్లు ఆమె దూరంగా ఉందని చెప్పాడు ఆయుష్మాన్ ఖురానా.


ఇటీవల ఆయన నటించిన బధాయి హో సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని వెళ్లడించాడు. అయితే ఒక్క కిస్సుకే ఇలా అయితే ఇమ్రాన్ హస్మి లాంటి సీరియల్ కిస్సర్ కు ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మరి. అయితే తన భార్య ఇప్పుడు కాస్త ప్రాక్టికల్ గా మారిందని అందుకే మన్మర్జియాన్ సినిమాలో ఆమె ముందే భూమి ఫెడ్నేకర్ తో లిప్ లాక్ చేశా అన్నాడు ఆయుష్మాన్.



మరింత సమాచారం తెలుసుకోండి: