స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి రాబోతున్న వీకెండ్ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ భారీ సెట్స్ మేకింగ్ కు సంబంధించిన ఒక మేకింగ్ వీడియోను ఈనెల 3న కానీ లేదంటే 4న కానీ విడుదల చేసి అందరికీ ఊహించని షాక్ ఇవ్వాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. 
RRR movie
ఈమూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించవచ్చునని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆహీరోయిన్స్ కు సంబంధించిన వివరాలను కూడ రాజమౌళి ప్రకటించే ఆస్కారం ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ షూటింగ్ ఈనెల 18న  ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. 

గత మూడునెలల నుండి హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో నిర్మాణం జరుపుకుంటున్న అత్యంత భారీ సెట్ 1920 కాలంనాటి కట్టడాలను ప్రతిబింబించేలా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ విలేజ్ లోకి ఎంటర్ అయిన వారికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తామంతా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన 1920 లోనే ఉన్నామా అన్న ఫీలింగ్ ఈమూవీలో నటిస్తున్న నటీనటులకు సాంకేతిక నిపుణులకు వచ్చే విధంగా ఈసెట్ డిజైన్ రూపొందింప బడింది అంటున్నారు. 
RRR movie
ఈసెట్ నిర్మాణానికి సంబంధించి ప్రతిరోజు రాజమౌళి గండిపేట్ ప్రాంతానికి వచ్చి తన సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. ‘జూనియర్ దొంగ గా చరణ్ పోలీస్ గా’ కనిపించబోయే ఈమూవీలోని జూనియర్ చరణ్ ల లుక్ లు కూడ చాల డిఫరెంట్ గా తీర్చి దిద్దడానికి రాజమౌళి ఇప్పటికే ఒకభారీ స్కెచ్ వేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంకా అధికారికంగా ప్రారంభం కాకుండానే ఈమూవీ సెట్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ రాజమౌళి ఈభారీ సినిమా  ప్రమోషన్ ను ప్రారంభించాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: