మనదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి చాల పెద్ద పండుగ. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ఈపండుగానాడు ఇళ్ళు, దుకాణాలు మరియు బహిరంగ ప్రదేశాల్లో మట్టితో తయారుచేసిన నూనె దీపాలను పెడతారు. దీనినే దీపావళి పండుగ అని అంటారు. దీపావళి పండుగను భారతదేశం, మలేషియా, సింగపూర్, మారిషస్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ మరియు బ్రిటన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. 
Celebrating five days of Diwali
భవనాలను ఫాన్సీ లైట్లతో అలంకరించడం బాణాసంచా కాల్చడం ఈపండుగాలోని ప్రత్యేకత.  రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అదేవిధంగా ద్వాపర యుగంలో  భగవాన్ శ్రీకృష్ణుడి భార్య సత్యభామ అసురుడు నరకాసురుడిని చంపిన రోజు దీపావళి పండుగతో సంబంధ బాంధవ్యాలు కలిగిన పురాణ నేపధ్యం ఉంది. అయితే ఈపండుగాను ఉత్తరాది ప్రాంతంలో ఐదు రోజుల పండుగగా కూడ జరుపుకుంటారు. 
Celebrating five days of Diwali
ఈ పండుగలో ప్రతిరోజు సంపద దేవత అయిన లక్ష్మి దేవిని పూజిస్తారు. లక్ష్మి దేవిని కీర్తిస్తూ వెండి లేదా బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. సూర్యాస్తమయ సమయంలో లక్ష్మి పూజ చేసి దీపాలను వెలిగిస్తారు. దీపావళి పండుగరోజున వెలిగించే ఈదీపాలు చెడు ఆత్మలను ప్రాలద్రోలతాయని నమ్మకం. ఇక రెండవరోజును ఛోటీ దీపావళిగా జరుపుకుంటారు. ఆరోజున శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి అలసట నుండి ఉపశమనం పోందడమే కాకుండా తల స్నానం చేయడంతో దీపావళి సంబరాలు ప్రారంభం అవుతాయి.  దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయటం ప్రధాన వేడుక మరియు నెల 15వ రోజున పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ రోజు చీపురును పూజిస్తారు. ఇది ఇంటిని శుభ్రంగా ఉంచటానికి సహాయపడుతుంది. దేవాలయాలలో డ్రమ్స్ మరియు గంటలను మ్రోగిస్తారు. అలాగే దీపాలను వెలిగించి టపాసులను కాలుస్తారు. చెడు పైన విజయం సాధించిన రోజుగా దీపావళిని జరుపుకుని లక్ష్మిదేవి యొక్క దీవెనలను పొందుతారు.
Celebrating five days of Diwali
ఇక దీపావళి పండుగ సంబంధించిన చివరిరోజున భాయ్ దూజ్ దీపావళిగా జరుపుకుంటారు.  మన మత గ్రంధాల ప్రకారం, యముడు తన సోదరి ఇంటిని సందర్శించిన్నప్పుడు అతని సోదరి యామి అతని క్షేమం కోసం అతని నుదుటిపై ఒక పవిత్రమైన తిలకం ఉంచడం ద్వారా అతనికి స్వాగతిస్తుంది. అప్పుడు యముడు ఈరోజున ఎవరైతే తన సోదరి చేత నుదుటిన తిలకం పెట్టించుకుంటారో వారికి హాని కలుగాచేయను అని యముడు ఆమె సోదరికి వరం ఇచ్చినట్లు పురాణ గాధలు చెపుతున్నాయి.  ఇలా ఎన్నో ఆచార వ్యవహారాలతో మిళితమైన దీపావళి మన హైందవ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా మిగిలిపోయింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: