‘సైరా’ మూవీ కోసం 63 సంవత్సరాల వయసులో చిరంజీవి పడుతున్న శ్రమ ఆసినిమా పట్ల అతడి డెడికేషన్ ను సూచిస్తోంది. నాలుగు దశాబ్దాల ఫిలిం ఇండస్ట్రీ అనుభవం ఉన్నా ఒక సినిమాలో నటించేడప్పుడు ఇప్పటికీ చిరంజీవి ఒక విద్యార్ధిలా మారిపోతాడని ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖులు అనేక సందర్భాలలో ఇప్పటికీ చెపుతూనే ఉంటారు.
 సైరా కోసం
ఇలాంటి పరిస్థుతులలో చిరంజీవి ఈమధ్య తన జార్జియా భారీ షెడ్యూల్ ను ముగించుకుని త్వరలో ప్రారంభం కాబోతున్న మరో లేటెస్ట్ షెడ్యూల్ కు రెడీ అవుతూ చిరంజీవి తుపాకీ షూటింగ్ కు సంబంధించిన మెళుకువలు తెలుసుకోవడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ లో చిరంజీవి షూటింగ్ ఛాంపియన్ గగన్ నారంగ్ ని కలిసి తుపాకీ షూటింగ్ కు సంబంధించిన మెళుకవలు అత్యంత శ్రద్ధగా నేర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బ్రేక్ తీసుకుని
గగన్ నారంగ్ ఒలింపిక్ పోటీలలో పాల్గొని మనదేశానికి పతకం తీసుకు వచ్చిన గొప్ప ప్రొఫెషనల్ షూటర్. అతడికి అన్నిరకాల తుపాకుల గురించి తెలియడమే కాకుండా ఆ తుపాకులను ఎలా ఉపయోగించాలి అన్న విషయమై అనేక మెళుకవలు తెలుసు. 
Chiranjeevi Sye Raa Narasimha Reddy Teaser Launch - Sakshi
మెగాస్టార్ చిరంజీవి తనని కలసిన విషయాన్ని గగన్ నారంగ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అలాంటి గొప్ప వ్యక్తి తన వద్ద విద్యార్ధిగా మారి తుపాకీల గురించి వాటిని ఉపయోగించే పద్ధతి గురించి ఎంతో శ్రద్ధతో అడగడం తనకు ఆశ్చర్యం కలిగించింది అంటూ కామెంట్స్ పెట్టాడు. త్వరలో ఈసినిమాకు సంబంధించి హైదరాబాద్ లో షూట్ చేయబోయే భారీ యుద్ధ సన్నివేశాలలో చిరంజీవి గగన్ నారంగ్ చెప్పిన మెళుకవులను తన యుద్ద విన్యాసాలలో చూపించే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: