టాలీవుడ్ పాత తరం సినిమాల్లో మల్టీస్టారర్ సినిమాలకి పెట్టింది పేరు..అప్పట్లో ఎన్టీఆర్ ,ఏ ఎన్నార్ లాంటి అగ్రనటులు ఎటువంటి బేషజం లేకుండా అగ్రనాయకులమనే కించిత్ గర్వం లేకుండా కలిసి నటించి ప్రేక్షకులని రంజింప చేసేవారు..ఆ తరువాత కాలంలో ఈ సాంప్రదాయం పోయింది.పైగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవలు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు అభిమానులు..అయితే ఇప్పుడున్న హీరోలలో చాలా మంది సైతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలంటే వెనకడుగు వేస్తున్నారు..అయితే

 Image result for rrr movie latest images

మంచి కదా కధనం దొరికితే తప్పకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తామని ఎంతో మంది పైపై కి చెప్తున్నా అటువంటి కధలు లేకపోవడంతో బ్రతికిపోతున్నారు..కానీ రాజమౌళి బాహుబలి తరువాత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో ఒక మంచి మల్టీ స్టార్ట్ సినిమా ప్లాన్ చేశాడు అప్పటి నుంచీ ఒకే ఒక్క ఫోటో మాత్రం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది అదే RRR రాజామౌళీ ,ఎన్టీఆర్ ,రాంచరణ్..

 Image result for british attack india

అయితే ఈ సినిమా స్టొరీ ఇప్పటివరకూ ఎవరికీ తెలియకపోయినా అసలు ఈ సినిమా స్టొరీ ఇదే నాటో టాలీవుడ్ లో ఈ న్యూస్ సూపర్ టాక్ తెచ్చుకుంది..దాదాపు అందరూ ఈ సినిమా అసలు ఈ సినిమా అసలు కధ ఇదే అనేట్టుగా ఉంది ఆ స్టొరీ సరే అసలు ఈ సినిమా బ్యాక్‌ డ్రాప్ విషయానికొస్తే... 1920 నాటి  కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇందులో దేశ భక్తులుగా చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.

Image result for ram charan ntr

అయితే బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపిస్తారని , బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లుతాగించే పాత్రలో యంగ్ టైగర్ రోల్ కీలకంగా ఉంటుందని.  బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని, అయితే బ్రిటిష్ వారి తరుపున పని చేస్తున్నా నరనరాల్లో దేశ భక్తితో ఉండే పాత్రలో చరణ్ కన్పిస్తాడని టాక్ వినిపిస్తోంది..అయితే సినిమా క్లైమాక్స్ మాత్రం ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుందని దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే ఓ ఇద్దరు యోధుల వీర గాధ ఇదని తెలుస్తోంది..మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందొ కానీ మొత్తానికి ఈ స్టొరీ లైన్ మాత్రం అభిమానులని షేక్ చేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: