ఈరోజు విడుదల అయిన ‘సవ్యసాచి’ ని ప్రమోట్ చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో నాగచైతన్య ప్రస్తుతం తనకు సమంతకు వస్తున్న గొడవలను వివరించాడు. చాలాకాలం ప్రేమించి పెళ్లి చేసుకుని ఈమధ్యనే తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న వీరు ఈమద్యం తామిద్దరం బాగా గొడవ పడుతున్నామంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
శివ నిర్వాణ డైరెక్షన్‌లో
నాగచైతన్య నోటి వెంట ఆమాటలు విని నిర్ఘాంతపోయిన మీడియా వర్గాలను చూసి చైతన్య నవ్వుతు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈమధ్య జరుగుతున్న ఈగొడవలు అన్నీ తామిద్దరం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గురించి అని అంటూ ఆసినిమా కథ రీత్యా తమకు ఇప్పటి వరకు అనుభంలోకిరాని తగువులు నటించడం తమ ఇద్దరికీ చాల కష్టంగా ఉంది అంటూ ‘సవ్యసాచి’ ప్రమోషన్ లో తమ గొడవల వ్యవహారాన్ని చెప్పుకొచ్చాడు చైతన్య. 
సమంత నాపై అలా గెలిచింది..
ఇదే సందర్భంలో తామిద్దరం కలిసి నటిస్తూ ఉన్నా ఒకే కారులో ఆమూవీ షూటింగ్ కు వెళ్ళడం లేదని తాను షూటింగ్ కోసం తొందరగా రెడీ అయినా సమంత చాల ఆలస్యంగా షూటింగ్ కు రెడీ అవుతుందని అంటూ జోక్ చేసాడు చైతు. ఇక ఈరోజు విడుదల అవుతున్న ‘సవ్యసాచి’ కథ మొదట్లో తాను విన్నప్పుడు ఈమూవీ సక్సస్ కాదని తాను తిరస్కరించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు.
ఒకేరోజు రిలీజ్ కావడం
అయితే పట్టువదలని విక్రమార్కుడులా దర్శకుడు చెందు మొండేటి ‘సవ్యసాచి’ కథకు అన్ని కమర్షియల్ అంశాల్ని ఏర్చికూర్చి తిరిగి కథను పూర్తి స్థాయిలో వినిపించడంతో ఈసినిమాను వదులుకోకూడదని తాను ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తున్నప్పుడే నిశ్చయించుకున్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు ఈ అక్కినేని హీరో. ఇదే సందర్భంలో ‘సవ్యసాచి’ లో తన పాత్రకు లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ సమస్య గురించి మరింత తెలుసుకోవడానికి యూట్యూబ్ లో అనేక వీడియోలు చూసి తాను తెలుసుకున్న విషయాలను వివరిస్తూ ‘సవ్యసాచి’ పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలు ఉన్న ఒక చక్కని వినోదాత్మక చిత్రమని చెపుతున్న చైతన్య మాటలకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది మరో రెండు మూడు గంటలలో తెలిసిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: