యంగ్ హీరో అఖిల్ కు నందమూరి సింహం బాలకృష్ణ నుండి ఎదురౌతున్న కష్టాలు ఊహాజనితంగా ఉన్నాయని సెటైర్లు పడుతున్నాయి. వాస్తవానికి అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ మూవీని డిసెంబర్ లో విడుదల చేద్దామనుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే ఈమూవీ షూటింగ్ నవంబర్ రెండవ వారానికి పూర్తి చేసారు. 
Akhil Akkineni in Mr Majnu
అయితే ఎప్పుడు లేని విధంగా డిసెంబర్ నెలలో కూడ అనేక సినిమాలు విడుదల అవుతున్న పరిస్థుతులలో అఖిల్ కు తన సినిమాను క్రిస్మస్ రేసుకు తీసుకురావడానికి సరైన డేట్ దొరకలేదు. దీనితో సంక్రాంతి గురించి ఆలోచిస్తే భారీ సినిమాలు అన్నీ లైన్ కట్టడంతో అఖిల్ రాజీపడి రిపబ్లిక్ డేకి తన ప్లాన్ మార్చుకున్నాడు.

కానీ ఇక్కడ కూడ అఖిల్ కు విపరీతమైన పోటీ ఏర్పడి ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడుతో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ తో పోటీ పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదు అనుకుని అఖిల్ యూత్ బాగా ఇష్టపడే వేలెంటైన్స్ డేకి ఫిబ్రవరిలో వద్దాము అనుకుంటే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 విషయంలో బాలకృష్ణకు లేటెస్ట్ గా వచ్చిన ఆలోచనల ప్రకారం ఎన్టీఆర్ పార్ట్ 2 ‘మహానాయకుడు’ ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. 
Mr. Majnu Telugu Movie
దీనితో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అన్ని నెలలకు సంబంధించిన డేట్స్ అన్నీ అందరు హీరోలు తన్నుకుపోతూ ఉంటే ఇప్పుడు ఏమి చేయాలో తెలియక అఖిల్ బాలకృష్ణ నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి దర్శకుడు వెంకీ అట్లూరి ఈమూవీ నిడివి విపరీతంగా పెంచాడు అంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈమూవీ నిడివి తగ్గించే కార్యక్రమం మొదలైంది. ఇలా రకరకాల కారణాలతో ‘మిస్టర్ మజ్ను’ కు అంతా అయోమయ పరిస్థితి అంటూ సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: