విభిన్న కథాంశం తో నాగ చైతన్య మొదటి సారిగా సవ్య సాచి లో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ కు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ప్రేమమ్ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. దీనితో సవ్యసాచిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ట్విన్ సిండ్రోమ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఈ చిత్రం విడుదల కాబోతుండగా యూఎస్, ఇతర ప్రాంతాలలో పూర్తయ్యాయి. టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

Image result for savya sachi

సవ్యసాచి అద్భుతమైన కథతో రూపొందించారు. సినిమాలో మంచి వినోదం కూడా ఉంది. సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య పాత్ర అదిరిపోయింది. చైతు అద్భుతంగా నటించాడు. కానీ మాధవన్ పాత్ర నిరాశ పరిచింది. నాగ చైతన్య నటన బావుంది. సెకండ్ హాఫ్ లో చైతు, మాధవన్ మధ్య సాగే సన్నివేశాలు నిరాశపరిచే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

Image result for savya sachi

సవ్యసాచి చిత్రంతో చైతన్య అభిమానుల ఆకలి తీర్చేశాడు. సూపర్ హిట్ బొమ్మ. సవ్యసాచి ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ సన్నివేశంతో మరోస్థాయికి తీసుకుని వెళ్లారు. సవ్యసాచి చిత్రంలో కాలేజ్ లో జరిగే ఫైట్ అదిరిపోయింది. చైతూని చందు అద్భుతంగా చూపించాడు. చివరి 40 నిమిషాలు సినిమా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం వలన సినిమా నిరాశపరిచి విధంగా ఉంది. చైతు ఫైట్స్, డాన్స్ చాలా బాగా చేశాడు. మంచి కథలు ఎంచుకోవడంలో తమకు తామే సాటి అని మైత్రి మూవీస్ మరోమారు నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: