నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘సవ్యసాచి’ ప్రీమియర్ షోలు అమెరికాలో పూర్తి కావడంతో ఈమూవీకి సంబంధించిన ప్రాధమిక ఓవర్సీస్ టాక్ బయటకు వచ్చింది. ట్విన్ సిండ్రోమ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన ఈమూవీ కథ పై అంచనాలు బాగానే ఉన్న నేపధ్యంలో ఈమూవీకి అత్యంత భారీస్థాయిలో బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే.
Savyasachi Photos
ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన కథలో వెరైటీ కనిపించినా నాగచైతన్య నటన అద్భుతంగా ఉన్నా విలన్ గా నటించిన మాధవన్ పాత్ర వీక్ అవ్వడంతో ఈమూవీ కొంతమందికి నిరాశ కలిగించిందని వార్తలు వస్తున్నాయి. 
Savyasachi Photos
ఈమూవీ సెకండ్ ఆఫ్ లో చైతు మాధవన్ మధ్య సాగే సన్నివేశాలు నిరాశపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఈమూవీని సాధారణ ప్రేక్షకుడు ఒకసారి చూడటానికి ఇష్టపడతాడు కానీ రెండవసారి చూడటానికి ఇష్టపడడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓవర్సీస్ లోని చైతన్య అభిమానులు మాత్రం ఈమూవీ సూపర్ హిట్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేసారు. 
Savyasachi Photos
ముఖ్యంగా ఈమూవీ ఇంటర్వెల్ సన్నివేశంతో మరోస్థాయికి తీసుకు వెళ్ళి పోతుందని ఈమూవీలోని కాలేజ్ లో జరిగే ఫైట్ అదిరిపోయిందని చైతూని చందు మొండేటి అద్భుతంగా చూపించాడు అంటూ చైతన్య అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి చివరి 40 నిమిషాలు సినిమా ఉత్కంఠ భరితంగా కొనసాగడం ఈసినిమాకు ప్లస్ పాయింట్ అంటున్నారు. అయితే ఈమూవీ ఫస్ట్ ఆఫ్ స్లోగా కొనసాగడం కొంతవరకు సాధారణ ప్రేక్షకుడుకి అసహనం కలిగించే విషయమే అయినా చైతూ ఫైట్స్ డాన్స్ లు ఈసినిమాకు హైలెట్ అంటున్నారు. బయటకు వస్తున్న ఈ టాక్ ను బట్టి ‘సవ్యసాచి’ కి కూడ డివైడ్ టాక్ ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఇచ్చే తీర్పు బట్టి సుమారు 30 కోట్ల బిజినెస్ జరిగిన ఈమూవీ పరిస్థితి ఆధారపడి  ఉంటుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: