అల్లు అర్జున్ కోసం సుమారు ఒక సంవత్సరం పైగా ఎదురు చూసి బన్నీని తన కథతో  మెప్పించదానికి దర్శకుడు విక్రమ్ కుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫెయిల్ అవ్వడంతో బన్నీ విక్రమ్ కుమార్ ల మూవీ ప్రాజక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. ‘అరవింద సమేత’ రిజల్ట్ తరువాత బన్నీ త్రివిక్రమ్ వైపు వెళ్ళిపోవడంతో విక్రమ్ కుమార్ నిరాశ పడిపోయాడు.
నాని-విక్రమ్ కుమార్ ఫిక్స్
అయితే ఎవరు ఊహించని విధంగా నాని విక్రమ్ కుమార్ కు బాసటగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం విక్రమ్ కుమార్ నానీల మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు టాక్. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘జెర్సీ’ షూటింగ్ పూర్తికాగానే విక్రమ్ కుమార్ మూవీ షూటింగ్ కు నాని వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దగ్గర రెండు మూడు అడ్వాన్స్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిల్లో అశ్వనీదత్ తో పాటు మహేష్ సోదరి మంజులది కూడ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే నానికి అశ్వనీదత్ బ్యానర్ తో మంచి అనుబంధం ఉన్న నేపధ్యంలో విక్రమ్ కుమార్ మూవీ అశ్వినీ దత్ బ్యానర్ తోనే ఉంటుందని అంటున్నారు. 
Vikram Kumar (Photo: Deccan Chronicle)
‘హలో’ ఫెయిల్యూర్ తరువాత విక్రమ్ కుమార్ వైపు టాప్ హీరోలు ఎవరు దృష్టి పెట్టకపోయినా చాల ధైర్యంగా నాని ఈ క్రియేటివ్ దర్శకుడుకి అవకాసం ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే నానీతో తీయబోయే సినిమా కథ ఇప్పటికే విక్రమ్ అల్లు అర్జున్ కోసం తయారు చేసిన కథ అనుకోవాలా లేదంటే నేచురల్ స్టార్ కోసం విక్రమ్ ఏదైనా కొత్త కథను క్రియేట్ చేసాడా అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: