దేశరాజకీయాలలో వేగంగా వస్తున్న మార్పులు ఎన్టీఆర్ బయోపిక్ కు ఊహించని సమస్యలు తెచ్చి పెడుతుంది అని దర్శకుడు క్రిష్ మదనపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేఏడాది ఆరంభంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈబయోపిక్ కు టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుతో ఎన్టీఆర్ బయోపిక్ చిక్కులో పడటం ఖాయం అని క్రిష్ అభిప్రాయం అని తెలుస్తోంది. 
NTR Biopic: First Look At Rana Daggubati As Chandrababu Naidu
ఎన్టీఆర్ బయోపిక్ లో అలనాటి వెన్నుపోటు సీన్  ప్రస్తావన లేకుండా క్రిష్ చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ బయోపిక్ ను మేనేజ్ చేస్తున్న విషయం  తెలిసిందే. ఆరోజులలో ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గళమెత్తిన తీరును ఇప్పటివరకు జరిగిన సినిమా షూటింగ్ లో బాగా హైలైట్ చేసాడని టాక్. అలనాటి కాంగ్రెస్ పరిపాలన పై ఎన్టీఆర్ వేసిన సెటైర్లకు సంబంధించిన  డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలయ్య పై చిత్రీకరించాడని తెలుస్తోంది. 
Nandamuri Balakrishna and Rana Daggubati in a still from the NTR biopic
అయితే చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ తో స్నేహం కుదుర్చుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు సమస్యలు ఎదురౌవ్వడమే కాకుండా బాలయ్య నోటివెంట కాంగ్రెస్ వ్యతిరేక డైలాగులు వస్తే ప్రేక్షకులు హర్షించరు సరికదా కామెడీ చేస్తారు అన్న భయం క్రిష్ లో ఉన్నట్లు సంమచారం. దీనితో ఎన్టీర్ బయోపిక్ లో కాంగ్రెస్ ను విలన్ గా చూపిస్తూ ఇప్పటివరకు తీసిన సన్నివేశాలను యథాతథంగా సినిమాలో ఉంచితే రాష్ట్రంలో కేంద్రంలో టీడీపీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశముంటుంది కాబట్టి ఆసన్నివేశాలను తొలగించి కాంగ్రెస్ ను సాఫ్ట్ విలన్ గా మాత్రమే చూపించాలని క్రిష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
NTR Biopic First Poster: Nandamuri Balakrishna Is The Image Of NTR
దీనితో ఇప్పటికే యదార్ధ విషయాలకు దూరంగా చప్పగా ఉండబోతున్న ఎన్టీర్ బయోపిక్ లో కాంగ్రెస్ పై ఎన్టీఆర్ విరుచుకుపడే సీన్స్ కూడ మిస్ అయితే ఈబయోపిక్ ను ఎవరు చూస్తారు అన్న అనుమానం ఏర్పడి ఈమూవీ బయ్యర్లు కూడ వెనక్కు తగ్గే ప్రమాదం ఉందని క్రిష్ అయోమయం అని అంటున్నారు. ఈబయో పిక్ విషయంలో క్రిష్ పారితోషికం తీసుకోకుండా బిజినెస్ లో షేర్ తీసుకుంటున్న నేపధ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు క్రిష్ కు తీవ్రకలవర పాటుకు గురిచేస్తున్నట్లు టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: